ఈనెల 22,23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈమేరకు డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు,ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
North Korea: దక్షిణ కొరియా డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంపై ఎగరడంపై ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ దేశానికి వ్యతిరేకంగా కర పత్రాలను జార విడిచే డ్రోన్లు మా భూభాగంపై ఎగిరితే దక్షిణ కొరియా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు జారీ చేశారు.
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది చంద్రబాబు సర్కార్.. డ్రోన్ల ద్వారా ఫుడ్, బాస్కెట్స్ తీసుకెళ్లే విధానాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Indian Air Force : చైనా, పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుండి 31 రిమోట్‌తో నడిచే సాయుధ MQ-9B 'హంటర్-కిల్లర్' విమానాల కొనుగోలు కోసం భారతదేశం వేగంగా చర్చలు జరుపుతోంది.
అనకాపల్లి లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి దగ్గర ఓ డ్రోన్లు కలకలం సృష్టించింది.. దేవరపల్లి మండలం తారువ గ్రామంలో డిప్యూటీ సీఎం ఇల్లు, రాకపోకలు సాగించే మార్గంలో అగంతకులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు.. ఓ కారు, రెండు బైక్ ల పై వచ్చిన అగంతకులు ముత్యాలనాయుడు ఇల్లు, పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు. ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో డ్రోన్ లతో పెట్రోలింగ్ మొదలు పెట్టారు అధికారులు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆపరేషన్ మొదలుపెట్టి దశల వారీగా కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామని సిపి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెద్దపల్లిలో జరిగే అసాంఘిక శక్తుల నిర్మూలనకు, అలాగే ప్రజల పద్ధతులు కొరకు ఈ సేవలు మొదలు పెట్టామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాము…
Eagle Squad: అనుమానాస్పదంగా ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రోన్స్‌ను నిలువరించేందుకు తెలంగాణ పోలీసులు గద్దలను సిద్ధం చేస్తున్నారు. డ్రోన్స్‌ను అడ్డుకునేందుకు 'ఈగల్ స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.
Maldives : కొద్ది రోజుల క్రితమే మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందించేందుకు రక్షణ సహకార ఒప్పందంపై చైనా సంతకం చేసింది. మాల్దీవులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో గస్తీ కోసం టర్కీ నుండి డ్రోన్‌లను కొనుగోలు చేసింది.