Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ రాత్రిపూట రెండు డ్రోన్‌లతో క్రెమ్లిన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిందని రష్యా అధికారులు బుధవారం ఆరోపించారు. ఇదిలా ఉండగా.. దాడి అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ నివాసంపై క్షిపణి దాడికి రష్యా పార్లమెంట్ పిలుపునిచ్చింది. జెలెన్‌స్కీ ఈ కుట్ర చేశారని.. ప్రతీకారం తీర్చుకునే హక్కు రష్యాకు ఉందని పేర్కొంది.
Read Also: Russia: రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్యకు ఉక్రెయిన్ కుట్ర!.. డ్రోన్ దాడి వీడియో ఇదిగో..
క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడికి ప్రయత్నించినందుకు ప్రతిస్పందనగా, కైవ్‌లోని వోలోడిమిర్ జెలెన్స్కీ నివాసంపై క్షిపణి దాడికి క్రిమియన్ ప్రాంతం నుండి స్టేట్ డూమా డిప్యూటీ మిఖాయిల్ షెరెమెట్ పిలుపునిచ్చారు. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడి తర్వాత ప్రతీకార చర్య తీసుకుంటామని రష్యా హెచ్చరించింది. “క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడి చేసేందుకు కీవ్ చేస్తున్న ప్రయత్నానికి ప్రతిస్పందించడానికి మాస్కో సిద్ధంగా ఉంటుంది” అని రష్యా ప్రెసిడెన్షియల్ ప్రెస్ సర్వీస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘రెండు మానవ రహిత డ్రోన్లు పుతిన్ నివాసంపై దాడికి ప్రయత్నించాయి. రాడార్ వ్యవస్థను ఉపయోగించి రష్యా సైన్యం వాటిని కూల్చివేసింది. దీన్ని ఉగ్ర కుట్రగా మేం భావిస్తున్నాం. విక్టరీ డే సందర్భంగా విదేశీ ప్రతినిధులతో మే 9న మేము నిర్వహించే పరేడ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ఉక్రెయిన్ కుట్ర చేసింది. రష్యా బలగాలు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయి. శత్రువులు ఏ రూపంలో వచ్చినా దీటుగా బదులిస్తాయి.’ అని రష్యా ఓ ప్రకటనలో తెలిపింది.