అయోధ్య రాంలల్లా దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. రామజన్మోత్సవం పురస్కరించుకుని నాలుగురోజుల పాటు దర్శనం, హారతి పాస్ లు రద్దు చేశారు. అందుకు సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమాచారం అందించారు. రామజన్మోత్సవం ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. రామ నవమి రోజున మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, రామ్ లల్లా దర్శనం యధావిథిగా కొనసాగుతుందని తెలిపారు.
Read Also: Lok Sabha Election 2024: స్టేజీపై ఏడ్చేసిన మహిళా కాంగ్రెస్ నేత.. ఎందుకో తెలుసా..!
రామజన్మభూమి తీర్థ క్షేత్ర యాత్రికుల సహాయ కేంద్రంలో ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్ మాట్లాడుతూ.. నవమి రోజున ఉదయం 5 గంటలకు శృంగార్ హారతి జరుగుతుందని, రాంలల్లా దర్శనం మరియు అన్ని పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. దేవుడికి నైవేద్యం పెట్టే సమయం మాత్రం ఎప్పటిలాగానే కొద్దిసేపు తెర ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయంలో భక్తులు సహనంతో ఉండాలని, భక్తులు రామనామాన్ని జపించాలని, భగవంతుని స్తోత్రాలను పఠించడం సముచితమని ఆయన చెప్పారు.
Read Also: Mr and Mrs Mahi: ధోనీపై జాన్వీ కపూర్ సినిమా.. రిలీజ్ డేట్ మారిందోచ్!
ఇదిలా ఉంటే.. నవమి రోజున రాత్రి 11 గంటల వరకు దర్శనం కొనసాగుతుందని తెలిపారు. భక్తుల సంఖ్య, తక్షణ పరిస్థితుల దృష్ట్యా భోగ్, షయన్ హారితి ఉంటుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. మరోవైపు.. శ్రీరామ నవమి వేడుకలు దృష్ట్యా.. యాత్రికులు తమ మొబైల్స్, షూలు, చెప్పులు, బ్యాగులు, నిషేధిత వస్తువులు మొదలైన వాటిని సురక్షిత ప్రదేశంలో ఉంచి దర్శనానికి రావాలని.. తద్వారా లగేజీని తనిఖీ చేసి భద్రపరచడంలో సమయం వృథా కాకుండా ఉంటుందని తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి సూచించారు. దీంతో.. దర్శన మార్గం, దర్శనం అంతరాయం లేకుండా కొనసాగుతుందన్నారు. కాగా.. ఏప్రిల్ 16, 17, 18 మరియు 19 తేదీల్లో రాంలల్లా దర్శనం, హారతి అన్ని పాస్‌లు రద్దు చేయబడతాయని తెలిపారు.