ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడనున్నట్లు తెలిపాడు. 2023 ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ తన జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. ఈ క్రమంలోనే.. వన్డే ప్రపంచ కప్ 2027 ఆడతానని స్పష్టం చేశాడు.
KP Nagarjuna Reddy: వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి
ప్రస్తుతం వార్నర్ వయసు 37 ఏళ్లు. ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్ లో పాకిస్తాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ తనకు చివరిదని చెప్పాడు. కాగా.. వార్నర్ వన్డే క్రికెట్‌లో కొనసాగనున్నాడు. ఎక్స్ ఖాతాలో వార్నర్ గురించి పోస్ట్ చేశారు. వన్డే కెరీర్ అద్భుతమైన రికార్డులతో ముగిసింది అని తెలిపారు. ఈ పోస్ట్‌పై వార్నర్ స్పందిస్తూ.. “నేను పూర్తి చేశానని ఎవరు చెప్పారు?” తాను వన్డే క్రికెట్‌లో కొనసాగుతానని, వన్డే ప్రపంచకప్ 2027 కూడా ఆడగలనని స్పష్టమైన సూచన ఇచ్చాడు.
ODI World Cup 2027: ముగిసిన 2023 వరల్డ్ కప్.. తర్వాతి ప్రపంచకప్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున వార్నర్ అత్యధిక పరుగులు చేశాడు. అతను 11 మ్యాచ్‌లలో 11 ఇన్నింగ్స్‌లలో 48.64 సగటుతో 108.30 స్ట్రైక్ రేట్‌తో 535 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 163 పరుగులు పాకిస్తాన్‌పై చేశాడు. కాగా.. ఇప్పటి వరకు వార్నర్ అంతర్జాతీయ కెరీర్ చూస్తే.. ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్‌లు ఆడాడు. ఇప్పటి వరకు 109 టెస్టులు, 161 వన్డేలు, 99 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అతను టెస్టులో 199 ఇన్నింగ్స్‌లలో 8487 పరుగులు, 159 వన్డేల్లో 6932 పరుగులు, T20లలో 99 ఇన్నింగ్స్‌లలో 2894 పరుగులు చేశాడు. టెస్టులో 25, వన్డేల్లో 22, టీ20లో ఒక సెంచరీ సాధించాడు.