పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించేందుకు పాకిస్తాన్ తమ మాజీ బౌలింగ్ స్టార్లలో ఇద్దరిని నియమించింది. ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్, స్పిన్ బౌలింగ్ కోచ్ గా సయీద్ అజ్మల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది. వీరిద్దరు ఆస్ట్రేలియా పర్యటన నుండి జట్టు మేనేజ్‌మెంట్‌లో చేరతారని వెల్లడించింది.
Read Also: Pro Kabaddi League 10: మరో సీజన్కు సిద్ధమైన ప్రో కబడ్డీ.. డిసెంబర్ 2 నుంచి మ్యాచ్లు ప్రారంభం
ఇండియాలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చూపించిన సంగతి తెలిసిందే. లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో జట్టులో కీలక మార్పులు జరిగాయి. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా ఉన్న బాబర్ ఆజం కూడా.. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలిగాడు. అతని స్థానంలో షాన్ మసూద్ టెస్ట్ కెప్టెన్‌గా.. షాహీన్ షా ఆఫ్రిది టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు మాజీ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. అంతేకాకుండా.. ఇంజమామ్-ఉల్-హక్ వివాదాస్పద ఆరోపణలపై చీఫ్ సెలక్టర్గా పదవీవిరమణ చేశాడు. దీంతో మాజీ పేసర్ వాహబ్ రియాజ్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
Read Also: Tesla: భారత్‌తో టెస్లా ఒప్పందం.. ఈవీల దిగుమతి, త్వరలో ప్లాంట్..
కాగా.. కొత్తగా ఎంపికైన బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ రెండోసారి పాకిస్తాన్ జట్టుకు కోచ్ గా నిర్వర్తిస్తున్నాడు. ఇంతకుముందు టీ20 ప్రపంచ కప్ 2021లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఈ సందర్భంగా గుల్ మాట్లాడుతూ.. “పాకిస్తాన్ జట్టు బౌలింగ్ కోచ్‌గా చేరినందుకు నేను సంతోషిస్తున్నాను. పిసిబి మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జాకా అష్రఫ్ ద్వారా పాకిస్తాన్ క్రికెట్‌కు సహకరించే అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. పురుషుల జట్టుతో గతంలో పనిచేసిన అనుభవం ఉన్నందున, నా బౌలింగ్ నైపుణ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చే లక్ష్యంతో కోచింగ్ నైపుణ్యం నేర్పిస్తానని” గుల్ చెప్పాడు.