45 రోజుల పాటు భారత్లో వరల్డ్ కప్ ఫీవర్ నడిచింది. తాజాగా ఆదివారం ఫైనల్ లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ తో ప్రపంచ కప్ 2023 పూర్తయింది. అయితే ఈసారి ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటారని అనుకున్న టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా చేతిలో చూడాలంటే ఇంకో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. వన్డే క్రికెట్‌లో తదుపరి ప్రపంచకప్ 2027లో జరగనుంది. ఈ ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా.. ఈ మూడు దేశాలు కలిసి తదుపరి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Israel-Hamas War: “త్వరలోనే శుభవార్త”.. ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు కీలక వ్యాఖ్యలు..
ఆఫ్రికా ఖండంలో ప్రపంచకప్ జరగనుండటం రెండోసారి. అంతకుముందు 2003 ప్రపంచకప్ ఆఫ్రికాలో నిర్వహించారు. అప్పుడు దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు కెన్యా ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చాయి. ఆ ప్రపంచకప్‌లో.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే గ్రూప్ దశ నుండి నిష్క్రమించాయి. కెన్యా సెమీ-ఫైనల్ వరకు వెళ్లింది. సెమీస్‌లో టీమిండియా చేతిలో కెన్యా ఓడిపోయింది. 20 ఏళ్ల క్రితం ఆఫ్రికాలో జరిగిన ఈ ప్రపంచకప్ టీమిండియాకు చిరస్మరణీయం. 1983 తర్వాత భారత జట్టు తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. అప్పుడు కూడా ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది.
World Billiards Championship: చరిత్ర సృష్టించిన పంకజ్ అద్వానీ.. 26వ సారి టైటిల్ కైవసం
ఇదిలా ఉంటే.. 2027 ప్రపంచకప్ లో ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆడుతాయి.. నమీబియా ఆడదు. ఎందుకంటే జట్టు ప్రదర్శన ఆధారంగా తన స్థానాన్ని సంపాదించుకోవలసి ఉంటుంది. నమీబియా ప్రపంచ కప్ ఎంట్రీ ఫార్ములా ఇతర జట్లకు కూడా ఉంటుంది. మరోవైపు.. తదుపరి ప్రపంచకప్‌లో 14 జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లను ఇప్పటికే ఖరారు చేశారు. ఆ తర్వాత.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లు ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌ల ద్వారా టోర్నమెంట్‌లోకి ఎంట్రీ ఇస్తాయి.
Sudigali Sudheer: బాధలో ఉన్నోడికి భయం ఉండదు.. అదిరిపోయిన కాలింగ్ సహస్ర ట్రైలర్
ప్రపంచ కప్ 2027లో 7 జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. రౌండ్ రాబిన్ దశ తర్వాత, రెండు గ్రూపుల నుండి టాప్ 3 జట్లు తదుపరి దశకు చేరుకుంటాయి. అంటే రెండో రౌండ్‌లో 6 జట్లు ఉంటాయి. ఒక గ్రూప్‌లోని జట్టు మరో గ్రూప్‌లోని అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ విధంగా, ఈ రౌండ్‌లో ప్రతి జట్టుకు మూడు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో రెండు జట్లు ఎలిమినేట్ అవుతాయి.. మిగిలిన జట్లు సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడతారు.