Suryakumar Yadav: విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం రికార్డులపై టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కన్ను వేశాడు. సూర్య.. టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులకు కేవలం 159 పరుగులు కావాలి. ఆ పరుగులు చేస్తే.. 52 ఇన్నింగ్స్‌లలో అత్యంత వేగంగా మైలురాయిని చేరిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను సమం చేస్తాడు.
Read Also: World Cup Final Loss: వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి.. బంగ్లాదేశ్లో సంబరాలు..!
ఇంతకుముందు టీమిండియాలో ఆ ఘనత విరాట్ కోహ్లీ సాధించాడు. టీ20లలో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ ఉన్నాడు. 50 ఇన్నింగ్స్‌లలో 46.02 సగటుతో 1841 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ లో సూర్యకుమార్ మెరుగైన ప్రదర్శన చూపించలేదు. మూడు మ్యాచ్ లు ఆడిన అతను 10.50 సగటుతో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ఇక.. ఫైనల్ మ్యాచ్ లో జట్టును ఆదుకోవాల్సిన సమయంలో పేలవ ప్రదర్శన చూపి.. జట్టును విజయతీరాలకు చేర్చడంలో విఫలమయ్యాడు.
Read Also: Tollywood: ఫోటో అదిరింది.. వాళ్లు కూడా ఉంటే ఇంకా బావుండేది
ఇదిలా ఉంటే.. ఈనెల 23న ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టీ20 సిరీస్ ఆడనుంది. విశాఖలో తొలి టీ20 జరగనుంది. ఈ సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ సిరీస్ లో 2000 పరుగులు చేసి రికార్డను బద్దలుకొట్టాలనే ఆలోచనలో సూర్య ఉన్నాడు.