విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది.
విశాఖలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ను ముందుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ శతకం సాధించాడు. కేవంల 50 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు.
ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఐదుసార్లు టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులకు ఆ టీమ్ అంటే ఎంతో పిచ్చి. అలాంటిది గత సీజన్ తమ అభిమానులను ఎంతో నిరాశపరిచింది. అందుకోసమని 2024 సీజన్ పై ముంబై ఇండియన్స్ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జట్టులోకి విదేశీ ప్లేయర్లును తీసుకునే ఆలోచనలో ఉంది.