ఏపీలో భారీ వర్షాలు.. సీఎం జగన్ పర్యటన వాయిదా
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.. ఇక, నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.. గూడూరు డివిజన్లోని కోట.. వాకాడు.. చిల్లకూరు.. నాయుడుపేట డివిజన్లోని సూళ్లూరుపేట.. తడ ప్రాంతాల్లో అధిక వర్షం నమోదవుతోంది.. వర్షాలతో మెట్ట పంటలకు ప్రయోజనం కలుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అయితే, వర్షాల నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది.. షెడ్యూల్ ప్రకారం.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ రోజు సూళ్లూరుపేటలో పర్యటించాల్సి ఉంది.. కానీ, వర్షాల కారణంగా సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది.. ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని.. తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్‌ఈజెడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం నుంచి.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది.. కానీ, భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని రద్దు చేశారు.. త్వరలోనే తదుపరి తేదీని ప్రకటించనున్నట్టు సీఎంవో అధికారులు చెబుతున్నారు..
మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్.. ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏది..?
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కడలినీ, కాయ కష్టాన్నీ నమ్ముకొని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు.. మత్స్యకారుల సంక్షేమం.. ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిఏదీ ఏది? అని నిలదీశారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం ఆ దిశగా అడుగులు వేస్తాం. మెరైన్ ఫిషింగ్ కి తగ్గట్లు సుదీర్ఘ తీరం ఉన్న మన రాష్ట్రంలో, ఇన్ ల్యాండ్ ఫిషింగ్ కి అనువుగా ఎన్నో జల వనరులు ఉన్నాయి. కానీ, మన మత్స్యకారులకు తగిన జీవనోపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
బోట్ల దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం..
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం, బోట్లు దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. ప్రధాన అనుమానితుడుగా ఉన్న యుట్యూబర్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.. ఇప్పటికే 10 మంది అనుమానితులని అదుపులోకి తీసుకున్నారట పోలీసులు.. అనుమానితులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ ఆనంద్ రెడ్డి విచారిస్తున్నారు.. యుట్యూబర్ సెల్ ఫోన్ డేటా, హార్బర్ లో అతని కదలికలపై విచారణ కొనసాగుతోంది.. వారం రోజులగా హార్బర్ లో సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించడంతో హార్బర్ లో ప్రమాద తీవ్రత తగ్గిందని తెలిపారు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.. పోర్ట్, స్టీల్ ప్లాంట్.. పోలీసులు సకాలంలో స్పందించారు.. లేకుంటే ఆయిల్ ట్యాంకర్ ల నుంచి ముప్పు వుండేది.. ఇక, సీఎం జగన్ మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు.. బోటు ఖరీదు 30..50 లక్షలు అయినా అందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. పాక్షికంగా దెబ్బ తిన్న బోటు యజమానులకు మేలు జరుగుతుంది.. పరిహారం గతం మాదిరిగా ఆలస్యం కాకుండా రోజుల వ్యవధిలో పరిహారం ఇస్తాం అని ప్రకటించారు. బోటు కలాసీలు.. డ్రైవర్లకు .కూలీలను సక్రమంగా అడ్డుకోమని అధికారులను కోరాం. మునిగిపోయిన బోట్ల ను తొలగించాలని పోర్ట్ అధికారులను చెప్పామన్నారు.
ఆ మత్స్యకారుల ఖాతాల్లో సొమ్ము జమ.. బటన్‌నొక్కి విడుదల చేసిన సీఎం జగన్
భారీ వర్షాల కారణంగా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ్టి సూళ్లూరుపేట నియోజకవర్గం పర్యటన వాయిదా పడింది.. అయితే, సూళ్లూరుపేట వేదికగా తలపెట్టిన కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించారు సీఎం వైఎస్ జగన్.. ఓఎన్జీసీ పైపులైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు వర్చువల్‌గా డబ్బు విడుదల చేశారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.ఇక, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం. వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక పోస్ట్ పోన్ చేసుకున్నాం. కానీ, మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతామని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు, ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7 వేల 50 మంది, మొత్తంగా 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్.. నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడాం.. వారి తరఫున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో 323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించాం. 4వ విడత ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
మేము ఫైటర్లమే.. బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు..
బెదిరిస్తే భయపడం.. మేము ఫైటర్లమే అని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ ఆక్రమణదారుల ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెదిరింపులకు పాల్పడితే భయపడబోం.. మేం పోరాటయోధులమన్నారు. ప్రజల పక్షాన నిలబడతాం. మల్లన్న సాగర్ భూమిని చెట్టుకొమ్మలాగా కాజేసిన వారే నాపై పోటీ చేసే ధైర్యం లేక బీజేపీ పోళ్లను రానివ్వొద్దు అంటున్నారు. అయితే.. మీకు బాధ ఉంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని కోరారు. కాగా.. ప్రభుత్వ విలువ ప్రకారం భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తుంటే మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని నేను అన్నా.. అయినా నా మాట వినలేదని అన్నారు. అంతే కాకుండా.. భూ నిర్వాతులకు భూములను దూరం చేసి వాళ్ళను అడ్డా మీద కూలీలను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వారు దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్నోల్లు ఎప్పటికీ బాగుపడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరానికి నాలుగు సిలిండర్‌లు ఉచితంగా అధిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా కళ్యాణ లక్ష్మీ లక్ష నుంచి రెండు లక్షలకు పెంచుతామన్నారు. ఇక.. రూ.2100 ఉన్న వడ్లకి రూ.3100లకు పెంచుతూ మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తాని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
ఢిల్లీలో ఏపీ సీఐడీ లీగల్ టీమ్.. చంద్రబాబు బెయిల్ పై సుప్రీంకోర్టుకు..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.. ఈ సమయంలో కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది.. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకుంది.. ఏపీ సీఐడీ లీగల్ టీమ్ ఢిల్లీకి చేరుకుంది.. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిట్ మంజూరు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది ఏపీ సీఐడీ.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక, ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాగా, చంద్రబాబుకు బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందని ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.. పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది.. హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసిందని.. కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాల గురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించిందని.. దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు.. ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మైక్రోసాఫ్ట్ AI రీసెర్చ్ టీమ్‌ని ఇక వీరిద్దరే లీడ్ చేస్తారు.. సీఈవో సత్య నాదెళ్ల
ప్రతిభ ఉంటె అవకాశం దానంతట అదే వెతుకుంటూ వస్తుంది. అనడానికి సామ్ ఆల్ట్‌మన్ ఓ ఉదాహరణ. సామ్ ఆల్ట్‌మన్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Open AI సంస్థ CEO గా విధులు నిర్వహించారు ఈయన. కాగా కొన్ని కారణాల చేత ఆల్ట్‌మన్ న్ని CEO విధుల నుండి తొలిగించారు. కాగా ఈయన్ని విధుల నుండి తొలిగించాక ఆయన సహా ఉద్యోగి అయినటువంటి గ్రెగ్ బ్రాక్‌మన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అలానే మరో ముగ్గురు కూడా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. మరి కొంత మంది ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే Open AI సంస్థ మాజీ CEO సామ్ ఆల్ట్‌మన్, అలానే గ్రెగ్ బ్రాక్‌మన్ మైక్రోసాఫ్ట్ లో చేరనున్నారు. ఈ విషయం స్వయంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల X వేదికగా ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల X లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఇద్దరు OpenAI మాజీ ఉద్యోగులు అయినటువంటి ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరుతున్నారని.. కాగా ఇక పై AI రీసెర్చ్ టీమ్‌ని వీళ్లిద్దరూ కలిసి లీడ్ చేస్తారని.. ఈ నేపథ్యంలో వాళ్లకు కావాల్సిన వనరులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాగా సత్య నాదెళ్ల పోస్ట్‌ను సామ్ ఆల్ట్‌మాన్ షేర్ చేస్తూ.. ఆ పోస్ట్ కు ‘ది మిషన్ కంటిన్యూస్’ అని పిన్ చేశారు.
అయోధ్యలో పూజారి పదవికి దరఖాస్తులు.. ఇంటర్వ్యూ ప్రశ్నలేంటో తెలుసా ?
అయోధ్యలోని రామ మందిర పూజారి పదవికి 3000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 200 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచారు. మకర సంక్రాంతి తర్వాత 22 జనవరి 2024న ఎంపికైన పూజారులు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి సోమవారం మాట్లాడుతూ.. 200 మంది అభ్యర్థులను వారి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేశామన్నారు. వారిని ట్రస్ట్ ఇంటర్వ్యూకు పిలిచిందని తెలిపారు. అయోధ్యలోని విశ్వహిందూ పరిషత్ (VHP) ప్రధాన కార్యాలయం అయిన కరసేవక్ పురంలో వారికి ఇంటర్వ్యూ జరుగుతోంది. ట్రస్ట్ ప్రకారం.. బృందావన్‌కు చెందిన జైకాంత్ మిశ్రా, అయోధ్యకు చెందిన ఇద్దరు మహంతులు మిథిలేష్ నందిని శరణ్, సత్యన్నారాయణ దాస్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ వారిని ఇంటర్వ్యూ చేస్తోంది. ఈ 200 మంది అభ్యర్థుల్లో 20 మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను ఆరు నెలల శిక్షణ అనంతరం అర్చకులుగా తీసుకుని వివిధ పోస్టుల్లో నియమిస్తారు. ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ ఎంపిక కాని వారు కూడా శిక్షణలో పాల్గొనవచ్చని, వారికి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. భవిష్యత్తులో ఈ అభ్యర్థులకు అవకాశం ఇవ్వవచ్చు. అభ్యర్థుల శిక్షణ అగ్రశ్రేణి సాధువులు తయారుచేసిన మతపరమైన పాఠ్యాంశాలపై ఆధారపడి ఉంటుంది. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత ఆహారం, వసతి లభిస్తుంది. దీంతో పాటు వారికి నెలకు రూ. 2,000 భత్యం కూడా ఇవ్వబడుతుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థులను అనేక ప్రశ్నలు అడిగారు.
బాధపడొద్దు రోహిత్.. గొప్ప నాయకులకు కూడా చెడ్డ రోజులు ఉంటాయి: రాధికా
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి అనంతరం భారత ప్లేయర్స్ అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ బయటికి వస్తున్న దుఖాన్ని ఆపుకుని.. మౌనంగా మైదానాన్ని వీడాడు. ఇది చూసిన అభిమానులు మరింత భావోద్వేగానికి గురయ్యారు. జట్టు కోసం కష్టపడిన హిట్‌మ్యాన్ కళ్లలో నీరు చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. ఇందులో ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఎడల్‌వీస్’ ఎండీ, సీఈవో రాధికా గుప్తా కూడా ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మను ఉద్దేశించి ఎడల్‌వీస్ సీఈవో రాధికా గుప్తా తన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ‘గొప్ప నాయకులకు కూడా చెడ్డ రోజులు ఉంటాయి. కన్నీరు మిమ్మల్ని ఏమాత్రం బలహీనంగా చేయదు. వంద కోట్ల హృదయాలు మిమ్మల్ని ప్రేమిస్తున్నాయి కెప్టెన్’ అని రాధికా గుప్తా పోస్టులో రాసుకొచ్చారు. తన పోస్టుకు మైదానంలో రోహిత్ శర్మ భావోద్వేగంతో ఉన్న ఓ ఓ ఫొటోను జత చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్నా’. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మించారు.తండ్రి కూతురు అనుబంధం తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది. ‘హాయ్ నాన్న’ డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డీల్స్ విషయాల్లో హీరో నాని కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది.. దీని వెనుక ఆయన రెమ్యూనరేషన్ ప్రధాన కారణమని సమాచారం.. ఈ సినిమాకు ఆయన 25 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. డిసెంబర్ తొలి వారంలో ఈ సినిమాతో పాటు మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. థియేటర్లలో భారీ పోటీ నెలకొనడంతో ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ఎవరు కూడా ముందుకు రావడం లేదని సమాచారం.దాంతో హీరో నాని రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నవంబర్ 24న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అనౌన్స్ చేసింది. రెండున్నర గంటల సినిమా నుంచి రెండున్నర నిమిషాలు ప్రేక్షకులకు చూపించబోతున్నామని నాని ట్వీట్ చేశారు.దీనితో ఈ సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలు అని అర్థం అవుతోంది.
అంత పెద్ద దెబ్బ తగిలినా రిస్క్ చేయడం ఆపట్లేదు…
ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… ఈ మూవీతో యాక్షన్ హీరో అవ్వాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అనే కసితో ఒక హీరోగా సినిమాకి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. కథ కోరుకున్నది ఇచ్చేసిన అఖిల్, మాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ని కూడా చూపించాడు. సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు, ప్రమోషన్స్ మొత్తం తనే ముందుండి నడిపించాడు. ఎన్ని చేసినా సినిమాలో విషయం లేకపోవడంతో ఆడియన్స్ ఏజెంట్ సినిమాని రిజెక్ట్ చేసారు. సురేందర్ రెడ్డి మార్క్ మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యి అఖిల్ భారీ ఆశలపై ఏజెంట్ నీళ్లు చల్లింది. అప్పటి నుంచి అఖిల్ మళ్లీ ఎక్కడా కనిపించడంలేదు. ఏజెంట్ రిలీజ్ అయి 5 నెలలు అవుతున్నా కూడా అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రాలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి అనిల్ కుమార్ అనే ఓ డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సోసియో ఫాంటసీ జానర్ లో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పుడే ఇవ్వకుండా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు అనౌన్స్మెంట్ ఇచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లున్నారు. దాదాపు సమ్మర్ నుంచి అఖిల్ నెక్స్ట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. అయితే ఇప్పుడే ఈ మూవీ బడ్జట్ డీటెయిల్స్ బయటకి వచ్చి అందరికీ షాక్ ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా వంద కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నారట యువీ క్రియేషన్స్. కొత్త దర్శకుడు అండ్ అఖిల్ మార్కెట్… ఈ రెండు విషయాలని పరిగణలోకి తీసుకుంటే అన్ని కోట్లు పెట్టడం భారీ రిస్క్ అనే చెప్పాలి కానీ అనిల్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్ పై చాలా నమ్మకంతో యూవీ క్రియేషన్స్ అంత రిస్క్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారట. మరి అయ్యగారు ఈసారైనా పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి.
పుష్ప 2 హైలెట్ సీన్ లీక్.. ఎంత పని చేశావ్ దేవి..
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ రేంజ్ ను పుష్ప సినిమా పూర్తిగా మార్చివేసింది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. దర్శకుడు సుకుమార్ పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందించాడు. పుష్ప ప్రకటన సమయంలో పాన్ ఇండియా ఆలోచన లేదు.. షూటింగ్ మొదలయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే అన్ని ఏరియాల్లో భారీ హిట్ ను అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా వసూల్ చేసింది.. ప్రస్తుతం పార్ట్ 2 ను తెరకేక్కిస్తున్నారు.. మొదటి పార్ట్ కన్నా భారీ యాక్షన్ తో తెరకేక్కిస్తున్నారు.. ఇప్పుడు పుష్ప ది రూల్ బడ్జెట్ రూ. 350 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. చిత్రీకరణ దశలో ఉన్న పుష్ప 2 గురించి మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని కీలక విషయాలు లీక్ చేశాడు. సినిమా స్క్రీన్ ప్లే ఉత్కంఠ రేపుతుంది. ఇక జాతర నేపథ్యంలో గంగమ్మ అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ మీద తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా ఉంటాయని దేవిశ్రీ అన్నారు.. దేవి స్టోరీ లీక్ చేసాడని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తులో చర్చ చేస్తున్నారు.. గంగమ్మ గెటప్ లో అల్లు అర్జున్ లుక్ ఇప్పటికే పిచ్చ వైరల్ అయ్యింది. భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ గెటప్ లో భారీ యాక్షన్ సీన్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దేవిశ్రీ చేసిన కామెంట్స్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు.. దేవి శ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు..