బంగ్లాదేశ్తో మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా మిగిలి ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్.. 5వ స్థానానికి ఎగబాకింది. పాక్ 7 మ్యాచ్ల్లో 3 గెలువగా.. నాలుగింటిలో ఓడిపోయింది. అయితే.. ఈ విక్టరీ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తన స్పందనను తెలిపాడు. ప్రపంచకప్లో రాబోయే మ్యాచ్లలో తమ జట్టు వ్యూహం గురించి చెప్పాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఈజీ విక్టరీ పొందింది. పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే పాకిస్తాన్ ఈ విజయం తర్వాత.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ పై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 4 కీలక వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత.. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ షమీపై పొగడ్తల వర్షం కురిపించాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యా్చ్లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్ చేసిన పాక్.. 45.1 ఓవర్లలో 204 పరుగులకే బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేసింది.
వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు పేలవ ఫాం కొనసాగుతుంది. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపడం లేదు. ముఖ్యంగా బౌలర్ల విషయానికొస్తే.. మొదట్లో ఫామ్లో లేని షహీన్ షా అఫ్రిదీ.. రెండు మ్యాచ్ల తర్వాత పుంజుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు ఫెయిల్యూరే. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ఈ టోర్నీలో పూర్తిగా నిరాశపరిచాడు. అతని బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్ వీరవిహారం చేస్తున్నారు.
గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా తర్వాతి మ్యాచ్లో జట్టులో చేరనున్నాడు. నవంబర్ 2న ముంబైలో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ వరకు జట్టులోకి వస్తాడు కానీ.. మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
2023 ప్రపంచకప్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు వరుసగా 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బ్యాట్స్మెన్, బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆసియా కప్లో విజృంభించిన సిరాజ్.. వరల్డ్కప్ మ్యాచ్లకు ఫామ్లో లేకపోవడం టీమిండియాకు ఇబ్బందిని కలిగిస్తోంది.
ప్రపంచకప్లో భాగంగా ఈరోజు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్ ఎటాక్ లో దిగిన పాకిస్తాన్.. తొలి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి ఓవర్ 5 బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తాంజిద్ హసన్ వికెట్ పడగొట్టాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన…