శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. సోమవారం కొలంబోలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అబేశేఖరను క్రికెటర్స్ ముద్దుగా "అంకుల్ పెర్సీ" అని పిలుచుకునేవారు.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పూణే వేదికగా జరిగిన అఫ్గానిస్తాన్- శ్రీలంక మ్యాచ్ లో మరో సంచలన విజయం నమోదు చేసుకుంది. శ్రీలంకను 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఓడించింది.
క్రికెట్లో గాయపడటం సహజం.. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గానీ, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, బౌలింగ్ చేస్తున్నప్పుడు చిన్నచిన్న గాయాలు అవుతుంటాయి. ఒక్కొక్కసారి నాన్ స్ట్రైకర్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్‌కు గాయాలవ్వడం చూస్తుంటాం. తాజాగా ఈ వీడియోలో కూడా స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ కు బంతి వేగంగా వచ్చి తాకుతుంది. స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ బాల్‌ను కొడితే.. నాన్ స్ట్రైక్‌లో ఉన్న బ్యాటర్‌కు తాకుతుంది.
టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. భారత్ చాలా అద్భుతంగా ఆడుతుందని, ఇప్పటివరకు టోర్నమెంట్లో ఎటువంటి కఠినమైన పోటీని ఎదుర్కోలేదు. ఇంగ్లాండ్‌పై జట్టు 230 పరుగులు చేసిన తర్వాత, వారు కష్టాల్లో పడ్డట్లు అనిపించింది.. కానీ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో విజయం సాధించారని తెలిపాడు. గత కొన్నేళ్లుగా స్వదేశంలో భారత్ ఒక జట్టుగా బలమైన ప్రత్యర్థిగా ఉందని స్మిత్ అన్నాడు. సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం ఎప్పుడూ కష్టమే…
తాజా ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తుంది. దీంతో పీసీబీలో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ క్రికెట్లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా పూణే వేదికగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది.
వన్డే ప్రపంచకప్-2023 మ్యాచ్‌లో భాగంగా నేడు శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగుతుంది. పూణేలో ఈ మ్యాచ్ లో జరుగుతుండగా.. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన సమయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ గీతం అలపిస్తుండగా మస్కట్‌కు చెందిన ఓ బాలుడు ఉన్నట్టుంది కింద పడిపోయాడు.