విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు.. హాజరుకానున్న 90 దేశాల ప్రతినిధులు
ఇప్పటికే జీఐఎస్, జీ 20 సదస్సులతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన విశాఖపట్నం.. మరో అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైంది.. ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీకి ఆతిథ్యం ఇవ్వనుంది.. విశాఖ వేదికగా ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు జరగనుంది.. ఈ సదస్సుకు 90 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రతినిధులు హాజరుకానున్నారు.. 57 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతున్న ఈ సదస్సు విశాఖలో జరుగుతుండడం విశేషంగా చెప్పుకోవాలి.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ రాడిసన్ బ్లూలో జరిగే ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ) కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ రోజు విశాఖ రానున్నారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని జరగనుండగా.. 90 దేశాల నుండి దాదాపు 1,200 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ICID కాంగ్రెస్ అనేది ఈ రంగంలో ఏకకాలిక ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను చర్చించడం మరియు అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.. INCID తీసుకున్న కార్యక్రమాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి మద్దతు కారణంగా, సుమారు ఆరు దశాబ్దాల విరామం తర్వాత ICID కాంగ్రెస్ విశాఖలో జరుగుతోంది.
మహిళా వాలంటీర్‌కు మరో వాలంటీర్ వేధింపులు.. కోరిక తీర్చాలంటూ..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇదే సమయంలో.. కొందరు వాలంటీర్ల వెకిలిచేష్టలు మొత్తం వాలంటీర్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా తయారవుతున్నాయి.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాలంటీచర్ల అఘాయిత్యాలు వెలుగు చూశాయి.. వెంటనే వారిపై ప్రభుత్వం చర్యలకు కూడా పూనుకుంది.. కొందరు మర్డర్లు, అత్యాచార కేసుల్లోనూ దొరికిపోయారు.. తాజాగా.. ఓ వాలంటీర్‌కు మరో వాలంటీర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి.. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఓ వాలంటీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళా వాలంటీర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట మండలం పలివెలలో మహిళా వాలంటీర్‌కు మరో వాలంటీర్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.. మౌనంగా కొన్ని రోజుల పాటు వేధింపులను భరించిన సదరు మహిళా వాలంటీర్.. ఇంకా వేధింపులు పెరగడంతో.. పోలీసులను ఆశ్రయించింది.. మహిళ వాలంటీర్‌ను తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధించ సాగాడు సుబ్రహ్మణ్యం అనే మరో వాలంటీర్.. మొదట్లో సున్నితంగా మందలించినా అతడి బుద్ది మారలేదు సరికదా.. రోజురోజుకూ వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సదరు మహిళా వాలంటీర్ పేర్కొన్నారు. బాధిత వాలంటీర్ ఫిర్యాదుతో సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేశారు కొత్తపేట పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో ఐటీ రైడ్స్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు
హైదరాబాద్ లో మరోసారి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ నాయకురాలు పారిజాత, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం నుంచి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. బాలాపూర్‌లోని పారిజాత నివాసంలో ఇవాళ ఉదయం 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా ఆమెకు సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. బడంగ్‌పేట మేయర్‌గా పారిజాత ఉన్నారు. పారిజాత కూతురు ఫోన్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి హైదరాబాద్‌లో లేరు. పారిజాతకు సంబంధించిన ఇళ్లు, కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్‌ఆర్ నివాసం ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కేఎస్‌ఆర్ కు సంబంధించిన కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులుపెట్టిన కేఎల్ ఆర్. కేఎల్‌ఆర్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు. దీంతో హైదరాబాద్ లోని రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీరిద్దరితో పాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఐటీ దాడులు జరగడం ఇదే తొలిసారి. ఈ సమయంలో వాహనాల్లో తరలిస్తున్న డబ్బులను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. అయితే ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ నాయకుల ఇళ్లలో తనిఖీలు జరగడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అంబటి పల్లిలో మహిళా సదస్సు.. పొల్గొన్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిపోయిన పిల్లర్లను రాహుల్ గాంధీ పరిశీలించనున్నారు. అంబటి పల్లి మహిళా సదస్సులో రాహుల్ పాల్గొన్నారు. సభ పూర్తి కాగానే మెడిగడ్డకు రాహుల్ బయలు దేరనున్నారు. కల్వకుర్తిలో నిన్న జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాయని, అయితే టీఆర్ ఎస్ ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయని విమర్శించారు. ప్రియదర్శిని జూరాల, శ్రీరామ్ సాగర్. నాగార్జునసాగర్, సింగూరు ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టంగా ఉన్నాయని, లక్షల ఎకరాలకు నీరు అందించి సాగులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న ప్రజలకు ఆదాయం, పని లభిస్తున్నదని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి మరీ ప్రాజెక్టులు నిర్మించిందని మండిపడ్డారు.
గుడ్ న్యూస్.. న్యూ ఇయర్లో భారీగా జీతాల పెంపు
భారతీయ ఉద్యోగులకు కొత్త సంవత్సరం గొప్పగా ఉండబోతుంది. ఇటీవలి ఓ నివేదిక ప్రకారం 2024లో భారతదేశంలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగబోతున్నాయి. మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కొత్త సంవత్సరంలో అత్యధిక జీతాల పెంపు భారతదేశంలోనే జరగబోతోందని కూడా నివేదికలో పేర్కొన్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. భారతదేశంలోని ఉద్యోగుల జీతం 2024లో 9.8 శాతం పెరగవచ్చు. లేబర్ మార్కెట్‌లోని కఠిన పరిస్థితులు, అధిక ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు వచ్చే ఏడాది తమ జీతం బడ్జెట్‌ను దాదాపు 10 శాతం పెంచుకోవచ్చు. టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల ఉద్యోగులు ఎక్కువ ప్రయోజనం పొందబోతున్నారు. ఈ రంగాల్లోని ఉద్యోగుల జీతాలు 2024లో 10 శాతం పెరగవచ్చు. ప్రతిభకు డిమాండ్ స్థిరంగా ఉంటుందని ఈ రంగాల్లోని కంపెనీలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం కంటే వచ్చే ఏడాది జీతం పెరగనుంది.
సూపర్ ప్లాన్..రూ.87 రూపాయలతోరూ.11 లక్షలు రాబడి.. ఎలాగంటే?
కరోనా తర్వాత చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అతి బీమా కంపెనీ ఎల్ఐసీకూడా అనే స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని పథకాలు ప్రజల మన్ననలు పొందాయి.. అందులో మహిళల కోసం అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది.. అదే ఆధార్ శిలా పథకంలో పెట్టుబడిదారులు రోజుకు రూ.87 మాత్రమే ఇన్వెస్ట్ చేసి, రూ.11 లక్షల వరకు బెనిఫిట్ ను పొందవచ్చు.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ప్లాన్ అనేది నాన్‌లింక్డ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. మహిళా పాలసీదారుల కోసం రూపొందించారు. ఈ ప్లాన్‌లో భాగంగా.. ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తికి మెచ్యూరిటీ తర్వాత ఫిక్స్‌డ్ అమౌంట్ అందిస్తారు. ఆమె అకాల మరణం చెందితే కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తారు.. ఉదాహరణకు ఓ 55 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ 15 ఏళ్ల పాటు రూ.87 ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. మొదటి సంవత్సరంలో కాంట్రిబ్యూట్ చేసిన మొత్తం రూ.31,755 అవుతుంది. పదేళ్లకు కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ రూ.3,17,550కి చేరుతుంది. చివరగా 70 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి మొత్తం రూ.11 లక్షలు పొందేందుకు అర్హులు..
నేడు శ్రీలంకతో భారత్ ఢీ.. గెలిస్తే అధికారికంగా సెమీస్‌కు!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్క ఓటమీ లేకుండా.. సెమీస్‌కు అత్యంత చేరువగా వచ్చిన జట్టు భారత్. మరో విజయంతో నాకౌట్ బెర్తును అధికారికంగా సొంతం చేసుకోవడంపై టీమిండియా దృష్టిపెట్టింది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి మేటి జట్లపై విజయాలు సాధించిన భారత్.. బలహీన శ్రీలంకను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు. ఇక ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి సెమీస్ రేసులో వెనుకబడిన లంక.. వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాపై విజయం సాధించడం కష్టమే. రోహిత్ సేనకు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ప్రధాన ఆటగాళ్లందరూ ఫామ్ కనబర్చుతున్నారు. హార్దిక్ పాండ్యా దూరం కావడంతో.. తుది జట్టులో అవకాశం దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా సత్తా చాటారు. అయితే శ్రేయస్ అయ్యర్ ఫామ్ మాత్రం టీమిండియాను ఆందోళన కలిగిస్తోంది. మెగా టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌లలో శ్రేయస్ 134 పరుగులే చేశాడు. గత మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉండగా.. అనవసర షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. దాంతో లంకపై ఫామ్ అందుకోకపోతే.. టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయాల వైపు చూడడం ఖాయం. శుభ్‌మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. రోహిత్, కోహ్లీ, రాహుల్, జడేజా, కుల్దీప్, బుమ్రాలు నిలకడను కొనసాగిస్తున్నారు. ఆరు మ్యాచ్‌లు ఆడి రెండే గెలిచిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. కెప్టెన్ శనకతో పాటు పతిరన, కుమార గాయాలతో దూరం కావడం జట్టును దెబ్బ తీసింది. ఆరంభంలో అదరగొట్టిన కుశాల్ మెండిస్.. జట్టు పగ్గాలు అందుకున్నాక రాణించలేకపోతున్నాడు. నిశాంక ఒక్కడే పరుగులు చేస్తున్నాడు. ధనంజయ డిసిల్వా తేలిపోతున్నాడు. బౌలింగ్‌లో తీక్షణ నిరాశ పరుస్తున్నాడు. పేసర్ మదుశంక, సీనియర్ మాథ్యూస్ మీద జట్టు ఆశలు పెట్టుకుంది.
భారత్‌కు బ్యాడ్ న్యూస్.. హార్దిక్ పాండ్యా ఆడడం కష్టమే!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకువెళ్తున్న భారత్‌కు బ్యాడ్ న్యూస్. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ప్రపంచకప్ 2023 లీగ్ దశలో పాండ్యా ఆడడు అని స్పష్టం అయింది. ‘హార్దిక్ పాండ్యాకు అయిన గాయం చిన్నదే. ఎలాంటి ఆందోళన వద్దు. హార్దిక్ వేగంగా కోలుకుంటున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 చివరి లీగ్ మ్యాచ్‌కు తిరిగొచ్చే అవకాశముంది. నేరుగా సెమీఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశమూ లేకపోలేదు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. భారత్ ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న నేపథ్యంలో గాయం తగ్గినా.. నెదర్లాండ్స్‌పై ఆడే అవకాశాలు తక్కువే.
ఆ విధంగా అంటూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్!
ఆరేళ్ల ప్రేమించుకున్న టాలీవుడ్ స్టార్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వరుణ్-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్ మూడుముళ్లు వేశారు. వరుణ్-లావణ్యల వివాహంకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహంకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. పెళ్లిలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మనుమరాళ్లతో ఆడుకుంటూ సందడి చేశారు. ఇక పెళ్లి అనంతరం కుటుంబసభ్యులతో దిగిన ఫొటోను తన ఎక్స్‌లో షేర్ చేసి.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ విధంగా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి కొత్త ప్రేమతో నిండిన ప్రయాణాన్ని ప్రారంభించారు. కొత్త స్టార్ జంటకు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.