IND vs SL: ప్రపంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి ఓవర్లనే మొదటి వికెట్ కోల్పోయింది. మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రీలంక బౌలర్ మధుశంక బౌలింగ్ లో రోహిత్ క్లీన్ బౌల్డయ్యాడు.
Read Also: BJP 3rd list: బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
ఇప్పటివరకు ఆడిన భారత్ 6 మ్యాచ్ ల్లో అన్నింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ కు వెళ్లినట్లే.. మరోవైపు ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. రెండు మ్యాచ్ ల్లో ఆడి మంచి ప్రదర్శన చూపించిన బౌలర్ మహ్మద్ షమీ ఈ మ్యాచ్ లో ఎలా విజృంభిస్తాడో చూడాలి.
Read Also: Harish Rao: కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా.. మైనంపల్లి పై హరీష్ రావ్ ఫైర్
మరోవైపు శ్రీలంక జట్టు ఒక మార్పుతో ఆడుతుంది. ధనంజయ డిసిల్వ స్థానంలో హేమంత జట్టులోకి వచ్చాడు. శ్రీలంక టీమ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించగా.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్ స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 60 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్(22), విరాట్ కోహ్లీ(28) ఉన్నారు.