ప్రపంచకప్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో చెత్త రికార్డు నమోదైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఘోర పరాజయం పొందింది. తొలి బంతికే ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు. శ్రీలంక జట్టు వికెట్ల…
ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో చెలరేగడంతో లంకను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 302 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు బెర్త్ ఖాయం చేసుకుంది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్ క్రీజులో నుంచి ముందుకొచ్చి ఆఫ్ సైడ్ అద్భుత షాట్ ఆడాడు. అది చూసి నాన్-స్ట్రైక్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు.
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లంకేయుల ముందు భారీ స్కోరును ఉంచారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. ఓ భారీ సిక్సర్ కొట్టాడు. 36 ఓవర్లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్ మీదగా అయ్యర్ సిక్స్ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బాల్ 106 మీటర్ల దూరం వెళ్లింది.
శ్రీలంక ముందు టీమిండియా 358 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరును నమోదు చేసింది.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ తన జెర్సీ నంబర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన జెర్సీపై జెర్సీ నంబర్ 77ని ఎలా పొందాడనే దానిపై ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. జెర్సీ నంబర్ 77ని పొందడం, దానితో ఎలా ఆడుతున్నాడనే దాని గురించి వెల్లడించాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు పలువురు ప్రముఖులు స్టేడియంకు వచ్చారు. అందులో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఉంది. ఇప్పటికే టీమిండియా ఆడిన పలు మ్యాచ్‌లకు ఎంకరేజ్ చేయగా.. మరోసారి తళుక్కుమంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెమెరామెన్ సారాను చాలాసార్లు చూపెట్టాడు. ఎందుకంటే శుభమాన్ గిల్ క్రీజులో ఉన్నాడు కాబట్టి. ఇంతకుముందు గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తెగ ఎంకరేజ్ చేసిన సారా టెండూల్కర్..…
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.