Sachin Tendulkar: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరో అరుదైన గౌరవం దక్కింది. సచిన్ టెండూల్కర్‌కు ఎంతో ఇష్టమైన, చివరి మ్యాచ్ ఆడిన, తన కెరీర్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ నిలువెత్తు విగ్రహాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టించింది. ఇప్పటికే స్టేడియంలో సచిన్ పేరిట ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ కొడుతున్న పోజులో ఈ విగ్రహాన్ని రూపొందించారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత శిల్పి ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీసీసీఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్ ఆషిష్ షెలార్‌లతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) ప్రతినిధులు హాజరయ్యారు. త్వరలో శ్రీలంకతో భారత మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో సచిన్ విగ్రహావిష్కరణ జరగడం గమనార్హం.
Also Read: NZ vs SA: న్యూజిలాండ్ ఘోర ఓటమి.. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వాంఖడే స్టేడియంలో 2013 నవంబర్‌లో జరిగిన మ్యాచ్‌తో సచిన్ తన కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆనాడు సచిన్ చివరి మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా చూసేందుకు పోటెత్తిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. అర్ధ సెంచరీతో ఆ మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన సచిన్ అభిమానుల నినాదాల నడుమ తన కెరీర్‌ను ముగించారు. సచిన్ రిటైర్ అయి పదేళ్లు కావస్తున్నప్పటికీ, ఆయన నెలకొల్పిన అనేక రికార్డులు ఇప్పటికీ ఎవరూ అధిగమించలేదు. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా.. వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ స్టాండ్‌కు ఆనుకుని ఉండే ఈ విగ్రహాన్ని ఎంసీఎ ఈ ఏడాది లిటిల్ మాస్టర్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి పూనుకుంది. సచిన్ 50వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంలో వాంఖెడేతో అతడికున్న అనుబంధానికి తోడు భారత క్రికెట్‌కు ఈ దిగ్గజం చేసిన సేవలకు గుర్తుగా విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ఎంసీఎ గతంలోనే తెలిపింది.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!