ప్రపంచకప్ 2023లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. టీమిండియా ఆడిన 6 మ్యాచ్‌ల్లో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా రథసారధి రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ పొగడ్తల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ పుట్టుకతో వచ్చిన నాయకుడని వసీం అక్రమ్ అన్నారు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాను నిలువరించడం అసాధ్యమని పేర్కొన్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాల్ కొడితే సిక్సర్ పోవాల్సిందే. టీమిండియా యువ బ్యాట్స్మెన్ రింకూ సింగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్‌తో ఈరోజు జరిగిన క్వార్టర్‌ఫైనల్-1లో రింకూ చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు.
2023 ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు 168వ మ్యాచ్. ఇప్పటి వరకు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 98 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా, 11 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఇక.. వికెట్ల పరంగా ముత్తయ్య…
పంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి ఓవర్లనే మొదటి వికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్ స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 60 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్(22), విరాట్ కోహ్లీ(28) ఉన్నారు.
ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచ క్రికెట్లో ఎన్నో పెద్ద మైలురాళ్లను సాధించింది. 2007లో టీ-20 ఫార్మాట్లో భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపిన మహి, 2011లో 28 ఏళ్ల కరువుకు స్వస్తి పలికి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. కివీస్‌పై సౌతాఫ్రికా జట్టు 190 పరుగుల తేడా భారీ విజయం సాధించింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది.