ఆఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయంపై రతన్ టాటా స్పందించారు. అదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏ ఆటగాడికి సంబంధించిన సలహాలు లేదా ఫిర్యాదుల విషయంలో నేను ఐసీసీకి ఎలాంటి సలహా ఇవ్వలేదని రతన్ టాటా తన ట్వీట్లో రాశారు.
ఫైనల్‌కు చేరుకునే రెండు జట్లను ఆస్ట్రేలియా స్పిన్నర్ అస్టన్ అగర్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అగర్ జోస్యం చెప్పాడు.
ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత మళ్లీ గెలుపొందలేదు. మొత్తం 6 మ్యాచ్ ల్లో రెండు గెలిచి, నాలుగు ఓడిపోయారు. ఇంకా పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న కల దాదాపుగా చెదిరిపోయినట్లే..
వరుస ఓటములతో కొంత నిరాశతో ఉన్న న్యూజిలాండ్ టీమ్ కు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. నవంబర్ 1న సౌతాఫ్రికాతో జరుగనున్న కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి రానున్నట్లు సమాచారం.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా ప్రపంచ కప్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆయన ఎడమ చీలమండలో గాయమైంది. దీంతో బెంగళూరులోని NCAలో చికిత్స తీసుకుని ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే.. హార్ధిక్ పాండ్యా త్వరలోనే తిరిగి జట్టులోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
టీమిండియా గెలుపుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ .. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘లక్నో పిచ్ పై భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా వికెట్లు పడుతున్నా కూడా తన ఆటను కొనసాగించింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా లక్నోలో జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులు చేయగా.. 230 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు షాకిచ్చారు.
లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భాగంగా 29వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టీమిండియాను 229 పరుగులకే ఆలౌట్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అయితే బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 101 బంతుల్లో అత్యధికంగా 87 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచారు.
వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్ మరో సంచలన విజయం సాధించింది. ఇంతకుముందు సౌతాఫ్రికాను ఓడించి రికార్డ్ సాధించిన.. డచ్ జట్టు, తాజాగా బంగ్లాను ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 230 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 142 పరుగులకు ఆలౌట్ అయింది.