ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ దూకుడు.. చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌కి నిర్ణయం..
ఫైబర్ గ్రిడ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు దూకుడు చూపిస్తున్నారు.. ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల అటాచ్‌మెంట్ చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు.. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలంటూ.. హోంశాఖు ప్రతిపాదనలు పంపగా.. సీఐడీ అధికారుల ప్రతిపాదనకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో అనుమతి కోసం ఈ రోజు సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.. టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు ఆస్తులకు అటాచ్ మెంట్ కు నిర్ణయం తీసుకున్న సీఐడీ అధికారులు.. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర హోంశాఖకు పంపి ఆమోదింప జేసుకుంది.. దీంతో.. ఈ కేసులో మరింత దూకుడు చూపించినట్టు అవుతుంది..
విశాఖలో ప్రారంభమైన ఐసీఐడీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ప్లీనరీ
విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక అయ్యింది.. రుషికొండ ఐటీ హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభమైంది.. విశాఖ వేదికగా ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు జరగనుంది.. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో పాటు రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్, దేశవిదేశాలకు చెందిన 1200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 57 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతున్న ఈ సదస్సు విశాఖలో జరుగుతుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం వైఎస్ జగన్, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సును ప్రారంభించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అన్నారు.. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.. ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. కాగా, 90 దేశాల నుంచి ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరు కాగా.. నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే అజెండాగా చర్చలు సాగనున్నాయి..
అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత..
నీటిని ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ కు తరలించే వ్యవస్థలు ఏర్పాటు కావాలి.. అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) కాంగ్రెస్ ప్లీనరీని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాల సీజన్ క్రమేపీ తగ్గిపోతుంది.. దిగువ నదీ తీర రాష్ట్రంగా నీటి నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు.. వంశధార, నాగావళి, కృష్ణ, గోదావరి నదులు ఉన్నా అతివృష్టి, అనావృష్టి వల్ల నీటి నిర్వహణ పెద్ద సవాల్ గా మారిందన్నారు.. వర్షాలు కూడా చాలా పరిమిత సమయాల్లోనే కురుస్తుండడం వల్ల ఆ నీటిని ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ కు తరలించే వ్యవస్థలు ఏర్పాటు కావాలి.. అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత ఉంటుందన్నారు సీఎం జగన్. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న ఆయన.. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది.. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలన్నారు.. ఇక, సదస్సు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌కి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, విశాఖ వేదికగా ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు జరగనుంది.. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో పాటు రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్, దేశవిదేశాలకు చెందిన 1200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
రిజర్వాయర్లను కాపాడుతున్నాం.. ప్రతీ నీటి బొట్టును వినియోగించే మెకానిజం జరగాలి
ప్రతీ నీటి బొట్టును తిరిగి వినియోగించేలా సమర్థ మెకానిజం జరగాలి ఆకాక్షించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) కాంగ్రెస్ ప్లీనరీని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికీ ఇండియాలో 65 శాతం వ్యవసాయం భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉందన్నారు. భూగర్భ జలాల నిర్వహణ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్న ఆయన.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిల్వల నిర్వహణ జరగాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇరిగేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాం అన్నారు షెకావత్.. ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోందని.. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం అని వెల్లడించారు.. కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపడుతోంది.. రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం.. భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు.. నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్ తరాలను ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నాం.. తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం అని వెల్లడించారు..
ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు వేరు వేరు కాదు రెండు ఒక్కటే..
ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు వేరు వేరు కాదు రెండు ఒక్కటే అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా 32 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా పని చేసి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఎన్నికలు రాగానే ఆయన గురిగింజను అంటున్నారని మండిపడ్డారు. ఆయన ఏ సామాజిక వర్గం దగ్గరకు వెళ్తే ఆ సామాజిక వర్గం వాడిగా చెప్పుకునే మనస్థత్వం ఆయనదన్నారు. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఖమ్మంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. తుమ్మల వారిపై వీరిపై కేసులు పెట్టమని ఏ రోజు అధికారులను ఆదేశించలేదని గుర్తు చేశారు. అరాచక పాలన నడిపే వ్యక్తి కావాలా? అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా? అని ప్రశ్నించారు. ఇదే జిల్లాకు వచ్చి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అవాక్కులు పేలారని తెలిపారు. అరాచకంగా సంపాదించి డబ్బుతో నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్న అంటున్నారు, అరాచక అనే నైతిక హక్కు నీకు ఉందా కేసిఆర్? అని ప్రశ్నించారు. అయినా మీ లాగా.. మా కుటుంబంలో ఎవరు రాజకీయంగా డబ్బు సంపాదించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ కి ఛాలెంజ్.. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ముందా..!
తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందన్నారు. భారతదేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సే. అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయని పార్టీ కాంగ్రెస్ అన్నారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిసి రాహుల్ గాంధీ ఓబీసీల జపం చేయడం కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని మండిపడ్డారు. బీసీలను అవమానించడమే. మొన్న కేసీఆర్ కొడుకు, నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయన్నారు. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీసీలకు ఓట్లు అడగాలని తెలిపారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల నుండి ఆ తరువాత అన్ని ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంటే ఎక్కువగా సీట్లను, ఓట్లను సాధించిన పార్టీ బీజేపీ అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన పార్టీ బీజేపీ… తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయమన్నారు.
వీరు మామూలోళ్లు కాదురా బాబు.. పోలీసునే హానీ ట్రాప్ లో పడేసిన కానిస్టేబుల్
ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ప్రశాంతంగా జీవిస్తాడు. అలాకాకుండా పరస్త్రీకి ఆకర్షితులైతే ఆపైన జరిగే అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా కొందరు మహిళలు బాడాబాబులను ట్రాప్ చేసి ఆపైన వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి నిలువునా ముంచిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మహబూబ్ నగర్ జిల్లా లో వెలుగు చూసింది. ఓ మహిళ పన్నిన హని ట్రాప్ లో ఓ పోలీస్ అధికారి చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ కానిస్టేబుల్ పన్నిన ఉచ్చులో ఓ పోలీస్ అధికారి చిక్కుకున్నాడు. ఆ మహిళ కానిస్టేబుల్ హని ట్రాప్ చేస్తుంది అని గ్రహించలేని అధికారి ఆ మహిళ దగ్గర అడ్డంగా బూక్ అయ్యారు. మహిళ కానిస్టేబుల్ అనుకున్నది అనుకున్నట్లు జరింగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కానిస్టేబుల్ తన అసలు రంగు చూపింది. పోలీసు అధికారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ అధికారి మహిళ కానిస్టేబుల్ బండారం బయట పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపధ్యంలో మహిళ కానిస్టేబుల్ తన భర్తతో కలిసి అధికారిని హతమార్చేందుకు ప్లాన్ చేసింది. అయితే ఆమె భర్త కూడా కనిసబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీనితో ఆ మహిళ కానిస్టేబుల్ ఆమె భర్త కలిసి అధికారి పైన హత్యయత్నం చేసారు. భర్తతో కలిసి సీఐ మర్మాంగాలను కోసింది మహిళ కానిస్టేబుల్. ఇది గమనించిన స్థానిక పోలీసులు సీఐ ను ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసు అధికారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే ఆ మహిళ కానిస్టేబుల్ గతంలో కూడా ఓ పోలీస్ ఉన్నతాధికరిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం.
ఐదేళ్లలో రూ. 9,208.23 కోట్ల రహస్య విరాళాలు.. ఏ పార్టీకి ఎక్కువ వచ్చాయంటే?
ఎలక్టోరల్ బాండ్ లేదా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ వ్యవహారం 8 ఏళ్లుగా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో దాత ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది నల్లధనాన్ని ప్రోత్సహించే అవకాశం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడా వ్యాపారవేత్తలు తమ గుర్తింపును వెల్లడించకుండా డబ్బును విరాళంగా ఇవ్వడానికి ఈ పథకం రూపొందించబడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ విరాళాలు ఎందుకు అందుతాయని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ, దాత ఎల్లప్పుడూ పార్టీకి ఉన్న సామర్థ్యం నుండి విరాళం ఇస్తారని చెప్పారు. ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చిందో తెలుసుకుందాం. ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. గత ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు సుమారు రూ. 10,000 కోట్లు ఇవ్వబడ్డాయి. అందులో సగానికి పైగా మొత్తం భారతీయ జనతా పార్టీకి (బిజెపి) చేరింది. 2017-2018, 2021-2022కి సంబంధించి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా.. కాంగ్రెస్‌కు రూ. 952.29 కోట్లు మాత్రమే వచ్చాయి. 2017-2018, 2021-2022 మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం రూ. 9,208.23 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లు విక్రయించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ మొత్తం రూ.5,271.97 కోట్ల నిధులను పొందింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు రూ.952.9 కోట్ల విరాళాలు అందాయి.
నేను కూడా బ్యాడ్ కెప్టెన్.. కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, ఎప్పుడో ఒకప్పుడు పరాజయం పాలైనపుడు తాను కూడా బ్యాడ్ కెప్టెన్‌గా కనిపిస్తా అని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. మైదానంలో పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటానని తెలిపాడు. మైదానంలో తీసుకునే నిర్ణయాలు జట్టు విజయం కోసం మాత్రమేనని తాను నమ్ముతానని రోహిత్ చెప్పాడు. ప్రపంచకప్‌లో వరుసగా ఆరు విజయాలు అందుకున్న భారత్ సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. రోహిత్ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు అద్భుత కెప్టెన్సీతో టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ‘ఇప్పుడు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి. అందుకే అంతా బాగానే ఉంది. ప్రతి మ్యాచ్ ఫలితంపై నాకు ఓ అవగాహన ఉంది. వరుసగా విజయాలు సాధిస్తున్నపుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఎప్పుడో ఒకప్పుడు అపజయం ఎదురైనపుడు నేను కూడా బ్యాడ్ కెప్టెన్‌గా కనిపిస్తా. విమర్శలు, ట్రోల్స్ వస్తాయి. ఇప్పటికైతే జట్టు విజయం కోసం ఏం అవసరమనే దానిపైనే దృష్టిసారించా’ అని రోహిత్ తెలిపాడు.
అందమే అసూయ పడేలా ఉంది కదా మావా…
ఎవరికైన వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతూ ఉంటుంది, తమిళ బ్యూటీ త్రిష మాత్రం వయసు పెరిగే కొద్దీ ఎఫోర్ట్ లెస్లీ బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. ఏజ్ తో సంబంధం లేకుండా త్రిష రోజురోజుకి అందంగా కనిపిస్తోంది. 40 ఏళ్ల వయసులో చాలా మంది హీరోయిన్స్ కెరీర్స్ కి ఎండ్ కార్డ్ పడుతుంటే త్రిష కెరీర్ మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఇటివలే పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్-త్రిష ఎదురుపడే సీన్ చూస్తే త్రిషకి నాలుగు పదుల వయసు ఉందంటే ఎవరూ నమ్మరు. వయసులో వెనక్కి అందంలో ముందుకి వెళ్తున్న త్రిష లేటెస్ట్ నటించిన మూవీ ‘లియో’. దళపతి విజయ్ తో దాదాపు దశాబ్దమున్నర తర్వాత నటించిన త్రిష… విజయ్ పక్కన సూపర్బ్ గా సెట్ అయ్యింది. ఈ కాంబినేషన్ చూడడానికే థియేటర్స్ కి వెళ్లిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. లియో సినిమాలో త్రిష స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. లేటెస్ట్ గా లియో సక్సస్ మీట్ లో పాల్గొన్న త్రిష పింక్ కలర్ సారీలో మెరిసిపోయింది. త్రిష తన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేసింది. ఈ ఫోటోస్ ని చూసిన సినీ అభిమానులు త్రిషకి ఇంకా వయసు అవ్వలేదు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. లియో సక్సస్ మీట్ లో దళపతి విజయ్, త్రిష గురించి మాట్లాడుతూ… “20 ఏళ్లకి హీరోయిన్ అవ్వడం ముఖ్యం కాదు… 20 ఏళ్లుగా హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉండడం గొప్ప విషయం” అంటూ మాట్లాడాడు. నిజమే ఎందుకంటే కొత్త హీరోయిన్లు రాగానే పాత హీరోయిన్ల టైమ్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో త్రిష రెండు దశాబ్దాల సినీ కెరీర్ ని సక్సస్ ఫుల్ గా రన్ చేస్తోంది అంటే గ్రేట్ అనే చెప్పాలి.
ఓటీటీ లోకి వచ్చేసిన షారుఖ్ సూపర్ హిట్ మూవీ..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార షారుఖ్ సరసన హీరోయిన్ గా నటించింది..ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులు గా రెండు పాత్ర లలో నటించాడు..రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాతో అటు అట్లీ, నయనతార ఇద్దరూ బాలీవుడ్‍కు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు…ఈ సినిమా సెప్టెంబర్ 7న హిందీ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో వరల్డ్ వైల్డ్ గా విడుదలైన జవాన్ సినిమా వేల కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే, ఇప్పుడు జవాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా నవంబర్ 2 నుంచి నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో కనిపించని అదనపు సన్నివేశాలను కూడా జోడించి ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేశారు.దీనితో థియేటర్లలో జవాన్ మూవీ చూసిన వారు మళ్లీ ఓటీటీ లో చూసేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఓటీటీలో జవాన్ మూవీ రన్ టైమ్ థియేటర్లో ఉన్న దానికంటే ఎక్కువగా ఉంది. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఎంతో సంబరపడి పోతున్నారు. ఇదిలా ఉంటే జవాన్ సినిమా లో నయనతార, షారుక్ ఖాన్‍తోపాటు బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్య మల్హోత్రా, రిధి డోగ్రా, బిగ్ బాస్ సిరి హన్మంతు, యోగిబాబు, సంజయ్ దత్ మరియు సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమా లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు..అలాగే దీపికా పదుకొన్ ముఖ్య పాత్ర పోషించింది.
బిగ్ బాస్ సీజన్ 8కి నట సింహం హోస్టింగ్?
ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అంటే ఫాన్స్‌ని కొడతాడు, ఫోన్స్ విసిరేస్తాడు… ఇలా ఏవేవో కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అనే పేరు వినగానే అందరికీ థింకింగ్ మారిపోతుంది. జై బాలయ్య అనేది ఒక స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్ అయ్యింది. ఆహాలో అన్‌స్టాపబుల్ టాక్ షో ఎప్పటి నుంచి చేస్తున్నారో అప్పటి నుంచే బాలయ్యపై ఉన్న నెగిటివిటి తగ్గి, కంప్లీట్ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అన్‌స్టాపబుల్ షో నిజంగానే బాలయ్య పట్ల ఉండే థింకింగ్‌ని పూర్తిగా మార్చేసింది. గత రెండు సీజన్స్ లో బాలయ్యని చూసిన వాళ్లు, ఇన్ని రోజులు మనం వినింది ఇతని గురించేనా? బాలయ్య ఇంత సరదాగా ఉంటాడా? అంత స్పాంటేనియస్‌గా పంచులు వేస్తాడా? చిన్న హీరోలు అనే తేడా లేకుండా అందరితో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతాడా? అని స్వీట్ షాక్‌కి గురయ్యారు. లేటెస్ట్ గా స్టార్ట్ అయిన అన్ స్టాపబుల్ సీజన్ 3 లిమిటెడ్ ఎడిషన్ కూడా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సీజన్ 3 లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే కాబట్టి త్వరగానే కంప్లీట్ చేసిన బాలయ్య… ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ని హోస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. తెలుగులో ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ షోకి సెకండ్ సీజన్ నాని హోస్టింగ్ చేసాడు. మూడో సీజన్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఏడో సీజన్ వరకూ కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో ఎవరెవరో పేర్లో వినిపించినా కూడా నాగార్జున మాత్రమే కంటిన్యూ అవుతున్నాడు. లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8కి మాత్రం బాలయ్య హోస్ట్ గా వ్యవహరించనున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. సీజన్ 7యే బాలయ్య చెయ్యాల్సింది, అది మిస్ అయ్యి ఇప్పుడు సీజన్ 8ని హోస్ట్ చేస్తున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య టైమింగ్ కి, ఎవరైనా తప్పు చేస్తే ఆయనకి వచ్చే కోపానికి బిగ్ బాస్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మరి ఈ సీజన్ 8 హోస్టింగ్ విషయంలో బాలయ్య ఉన్నాడా లేక నాగార్జుననే కంటిన్యూ చేస్తాడా అనే విషయంలో ఎవరు క్లారిటీ ఇస్తారు అనేది చూడాలి.