Legendary Cricket Umpire Dickie Bird Passes Away: క్రికెట్ ప్రపంచం నుంచి ఓ దిగ్భ్రాంతికరమైన వార్త వెలువడింది. అద్భుతమైన నిర్ణయాలు, నిష్పాక్షిక అంపైరింగ్‌కు పేరుగాంచిన లెజెండరీ అంపైర్ డిక్కీ బర్డ్ 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన క్రికెట్ చరిత్రకు అనేక చిరస్మరణీయ క్షణాలను అందించారు.
ICC Hall of Fame: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికు క్రికెట్‌లో మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనిని చేర్చింది. ధోనితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా దిగ్గజాలు హాషిమ్ అమ్లా, గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్‌కు చెందిన డానియేల్ వెటోరి కూడా ఈ గౌరవంలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో మహిళా క్రికెటర్ల నుంచి ఇంగ్లాండ్‌కి…
End Of RO-KO Era: నేటితో భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు. దీనికి కారణం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడమే. మే 7న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు తెలపగా, నేడు విరాట్ కోహ్లీ కూడా సైనింగ్ ఆఫ్.. అంటూ సోషల్ మీడియా వేదికాగా భారత టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీమిండియాను నడిపించిన ఇద్దరు దిగ్గజాలు వారంలోపే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించడంతో…
ఐపీఎల్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. బ్యాటర్లు సిక్సులు, బౌండరీలతో చెలరేగుతుంటే.. బౌలర్లు డాట్ బాల్స్‌తో పాటు వికెట్లు తీసుకుంటున్నారు. అయితే.. బౌలర్లు ఎక్కువ వికెట్లు సాధిస్తే వారికి పర్పుల్ క్యాప్ అందించి ప్రోత్సహిస్తున్నారు. దీంతో.. బౌలర్లు తమ సత్తాను చాటుతున్నారు.
ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్‌ఆర్‌ఎంబీ స్టీల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు. ప్రపంచ కప్ విజేత దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, ఎమ్‌ఎస్ ధోనిలతో ఎలైట్ లీగ్‌లో చేరాడు. ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ.. కపిల్, ధోనీలతో కలిసి ఓ యాడ్ రూపొందించారు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు..
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజంను 'మోసగాడు' అని అభివర్ణించాడు. అతను మోసగాడు ఎందుకో గల కారణాన్ని అక్తర్ వివరించాడు. బాబర్ ఆజంను పాకిస్తాన్ కింగ్ అని పిలుస్తారు.. కానీ ఆజం పెద్ద మ్యాచ్‌లలో జట్టు తరపున సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
IMLT20: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతేడాది ప్రారంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా ఈ లీగ్‌ను మొదలు పెట్టేందుకు నిర్వాహకులు పూర్తి సన్నాహాలు చేశారు. ఐఎమ్‌ఎల్ టోర్నీ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభమై, మార్చి 16న ఫైనల్‌తో ముగుస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ లీగ్ మూడు వేదికలపై జరగనుంది. ఇక ఈ లీగ్‌లో…
Ravichandran Ashwin In India: భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియా, ఆస్ట్రేలియా గబ్బా టెస్ట్ డ్రా తర్వాత అతను ఈ విషయాన్ని తెలియచేసాడు. 38 ఏళ్ల అతను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన తర్వాత మరుసటి నేడు ( గురువారం) భారత్ కు చేరుకున్నాడు. గురువారం చెన్నైలోని ఇంటికి చేరుకున్న ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అశ్విన్ ఇంటికి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా…
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే జట్లపై స్టార్ స్పోర్ట్స్ నిపుణుల ప్యానల్ అంచనా వేసింది. అందులో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్ఆర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్తాయని ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, మహమ్మద్ కైఫ్, టామ్ మూడీ, మాథ్యూ హెడెన్లు అభిప్రాయపడ్డారు. అయితే, 18వ తేదీన సీఎస్కేతో మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపొంది ప్లేఆఫ్స్‌కు వెళ్తుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.