ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాగా.. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఏ టీమ్స్ ఫైనల్‌కు వెళ్తాయో అంచనా వేస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 23న భారత్-పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ టోర్నీకి ముందు క్రికెట్ దిగ్గజాలు గొడవ పడటం కలకలం రేపుతోంది. ILT20 2025 ఫైనల్‌లో టీమిండియా మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్, పాక్ మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్ గొడవ పడ్డ వీడియో వైరల్ అవుతుంది.
Read Also: Student Kidnapped: కాకినాడలో బాలుడి కిడ్నాప్.. గాలిస్తున్న పోలీసులు!
అయితే ఈ గొడవ సీరియస్‌గా జరిగింది కాదు.. ఫన్నీగా జరిగింది. స్టేడియంలో ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు సరదాగా గొడవ పడుతుండటం ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. వైరల్ అవుతున్న వీడియోలో హర్భజన్ బ్యాట్‌తో, షోయబ్ బంతితో ఒకరినొకరు సరదాగా నెట్టుకుంటూ, సవాలు చేసుకుంటున్నారు. కాగా.. ఈ వీడియోను అక్తర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశాడు. ‘ఛాంపియన్స్ ట్రోఫీకి మేమిలా సిద్ధమవుతున్నాం’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది.
Thats our way of getting ready for Champions Trophy. @harbhajan_singh kee kehnday oh? pic.twitter.com/ZufYlOt7Y4
— Shoaib Akhtar (@shoaib100mph) February 9, 2025