Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కోసం పాక్ ప్రభుత్వానికి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లేఖ..
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన..
- మెరుగైన చికిత్స అందించాలని సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లేఖ..
- పాక్ ప్రభుత్వానికి 14 మంది మాజీ కెప్టెన్ల అభ్యర్థన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌లో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఆయనకు కనీస చికిత్స కూడా పాక్ ప్రభుత్వం అందించడం లేదనే ఆరోపణ వస్తున్నాయి. మాజీ పాక్ కెప్టెన్ తన కుడి కంటిచూపును 80 శాతం కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఇమ్రాన్ ఖాన్ కోసం సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్ల బృందం పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మాజీ ప్రధాన మంత్రి మరియు ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు తక్షణ మరియు తగినంత వైద్య సహాయం అందేలా, కస్టడీలో గౌరవంగా వ్యవహరించేలా చూడాలని కోరారు. ఫిబ్రవరి 17న విడుదల చేసిన ఈ ప్రకటనలో.. ఇమ్రాన్ ఆరోగ్యం జైలులో క్షీణించిందని, రెండున్నర సంవత్సరాలుగా అతని నిర్భంధ పరిస్థితులు తీవ్రంగా క్షీణించాయని వచ్చిన నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Read Also: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లతో సహా లేఖపై సంతకాలు చేసిన వారిలో మైఖేల్ అథర్టన్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రెయర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాజర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ ఉన్నారు. 1992 వరల్డ్ కప్ విజయంలో ఇమ్రాన్ ఖాన్ పాత్రను లేఖలో హైలెట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ చూసిన అత్యుత్తమ ఆల్ రౌండర్లు, కెప్టెన్లలో ఒకరని లేఖలో పేర్కొన్నారు. ఖాన్‌కు తక్షణ, నిరంతర వైద్య సహాయం, కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఇవ్వాలని, మానవీయ నిర్బంధ పరిస్థితులు, చట్టపరమైన ప్రక్రియ హక్కులు పొందేలా చూడాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వారు కోరారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..