Legendary Cricket Umpire Dickie Bird Passes Away: క్రికెట్ ప్రపంచం నుంచి ఓ దిగ్భ్రాంతికరమైన వార్త వెలువడింది. అద్భుతమైన నిర్ణయాలు, నిష్పాక్షిక అంపైరింగ్‌కు పేరుగాంచిన లెజెండరీ అంపైర్ డిక్కీ బర్డ్ 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన క్రికెట్ చరిత్రకు అనేక చిరస్మరణీయ క్షణాలను అందించారు. డికీ బర్డ్ గతంలో మొదటి మూడు పురుషుల ఓడీఐ ప్రపంచ కప్ ఫైనల్స్‌కు అంపైరింగ్ చేశాడు. మొత్తంగా.. అతను 66 టెస్ట్ మ్యాచ్‌లు, 69 ఓడీఐలకు అంపైరింగ్ చేశాడు. అతని చివరి టెస్ట్ మ్యాచ్ 1996లో జరిగింది. ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లోనే సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ తమ టెస్ట్ అరంగేట్రం చేశారు.
READ MORE: Viral Video: ఇదే నా పేరు.. ఏం పీ*టావో పీ*క్కో.. ఫిర్యాదుదారులపై మహిళా పోలీసు దౌర్జన్యం(వీడియో)
డిక్కీ బర్డ్ మృతి పట్ల యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. యార్క్‌షైర్ క్రికెట్‌కు ఐకాన్‌గానే కాకుండా, క్రికెట్ చరిత్రలో గొప్ప వ్యక్తులలో ఒకరిగా క్లబ్ అభివర్ణించింది. 19 ఏప్రిల్ 1933న యార్క్‌షైర్‌లోని బార్న్స్లీలో జన్మించిన డిక్కీ బర్డ్.. క్రికెట్ పట్ల అంకితభావాన్ని ప్రదర్శించారు. ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్, యార్క్‌షైర్, లీసెస్టర్‌షైర్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు. గాయం కారణంగా క్రీడా జీవితం ముగిసినప్పటికీ.. అంపైరింగ్ బాధ్యతలు చేపట్టాడు. డికీ బర్డ్ ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. కానీ అంపైర్‌గా గణనీయమైన ఖ్యాతిని సంపాదించాడు.