ఐపీఎల్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. బ్యాటర్లు సిక్సులు, బౌండరీలతో చెలరేగుతుంటే.. బౌలర్లు డాట్ బాల్స్‌తో పాటు వికెట్లు తీసుకుంటున్నారు. అయితే.. బౌలర్లు ఎక్కువ వికెట్లు సాధిస్తే వారికి పర్పుల్ క్యాప్ అందించి ప్రోత్సహిస్తున్నారు. దీంతో.. బౌలర్లు తమ సత్తాను చాటుతున్నారు. అయితే తాజాగా సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆశ్చర్యమేంటంటే.. అతని వయస్సు పెద్దది. అయినప్పటికీ.. వయసేమీ అడ్డు పడలేదు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన అతి పెద్ద వయసు ఆటగాళ్లు కొందరు ఉన్నారు. వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం….
మిచెల్ స్టార్క్:
మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా డాషింగ్ ఫాస్ట్ బౌలర్.. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరపున తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై ఆడిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చూపించాడు. 3.4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. ఐపీఎల్‌లో 5 వికెట్లు తీసిన అతి పెద్ద వయస్సు ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 35 సంవత్సరాల 59 రోజుల వయస్సులో మిచెల్ స్టార్క్ ఈ రికార్డును తన పేరిట సాధించాడు. ఈ ఘనత అతని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఐపీఎల్‌లో ఈ రికార్డుతో అతను బౌలింగ్ ప్రపంచంలో మరొక అడుగు ముందుకు వేశాడు. ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద వయస్సు ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
అనిల్ కుంబ్లే:
భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే 38 సంవత్సరాల 138 రోజుల్లో ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన రికార్డు సృష్టించాడు. 2009లో రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున కుంబ్లే 5 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు.
మోహిత్ శర్మ:
మోహిత్ శర్మ 34 సంవత్సరాల 250 రోజుల్లో ఐపీఎల్‌లో ఐదు వికెట్లు సాధించాడు. 2023లో గుజరాత్ టైటాన్స్ (GT) తరపున ముంబై ఇండియన్స్ (MI) తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు.
డిమిట్రియోస్ మస్కరెన్హాస్:
డిమిట్రియోస్ మస్కరెన్హాస్ 34 సంవత్సరాల 165 రోజుల్లో ఐపీఎల్‌లో ఐదు వికెట్లు సాధించా. 2012లో పూణే వారియర్స్ (PW)పై 25 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ సమయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) తరపున ఆయన ఆడాడు.
భువనేశ్వర్ కుమార్:
భువనేశ్వర్ కుమార్ 33 సంవత్సరాల 99 రోజుల్లో ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన రికార్డును సృష్టించాడు. 2023లో గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున ఈ ఘనత సాధించాడు.