ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్‌ఆర్‌ఎంబీ స్టీల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు. ప్రపంచ కప్ విజేత దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, ఎమ్‌ఎస్ ధోనిలతో ఎలైట్ లీగ్‌లో చేరాడు. ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ.. కపిల్, ధోనీలతో కలిసి ఓ యాడ్ రూపొందించారు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు.. అత్యంత ప్రసిద్ధ క్రికెట్ కెప్టెన్లలో ముగ్గురు (కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ)కి చెందిన ఓ టీవీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
READ MORE: Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ భుజం ఎక్కిన బుడ్డోడు.. వాడి సంతోషం చూడండి..!
ఈ క్లిప్‌లో, ధోని, కపిల్ కొంతమంది ప్రతిభావంతులైన వ్యక్తులను ఎంచుకోవడానికి ఓ ప్యానెల్‌లో కలిసి కూర్చున్నట్లు చూడవచ్చు. కొంత మంది వచ్చి వేదికపై వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ… కపిల్, ధోనీకి వాళ్ల టాలెంట్స్ నచ్చడం లేదు. “మనకు ఛాంపియన్ ఎప్పుడు దొరుకుతాడు.” అని ధోని కపిల్‌తో అంటాడు. అప్పుడే రోహిత్ శర్మ వచ్చి.. ఐరన్ రాడ్డుతో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. రోహిత్ ఫార్ఫామెన్స్‌కు మిగతా కపిల్, ధోని ఫిదా అవుతారు. దీంతో రోహిత్ శర్మా వారిద్దరి వద్దకు వస్తాడు. “సెల్ఫీ చాహియే యా ఆటోగ్రాఫ్?” అని హిందీలో కపిల్‌దేవ్, ధోనీని అడుగుతాడు. అంటే.. నాతో సెల్ఫీ కావాలా? ఆటోగ్రాఫ్ కావాలా? అని ఇద్దరు దిగ్గజ కెప్టెన్లను రోహిత్ అడిగాడు. వెంటనే క్షమించాలని అడుగుతాడు రోహిత్. దీంతో యాడ్ ముగుస్తుంది. ముగ్గురు దిగ్గజ కెప్టెన్లు ప్రదర్శించిన ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rohit Sharma ad
Source:@ImRo45 Instagram and @SrmbSteel#RohitSharma𓃵 pic.twitter.com/y1OIZOYKYk
— Hitartha Bairagi (@BairagiHitartha) March 20, 2025