End Of RO-KO Era: దిగ్గజాల రిటైర్మెంట్.. టెస్టుల్లో ముగిసిన RO-KO శకం..!
- భారత క్రికెట్ అభిమానులకు హార్ట్ బ్రేక్..
- వారం వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల రిటైర్మెంట్.
- టెస్ట్ క్రికెట్ లో ఒక శకానికి తెర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
End Of RO-KO Era: నేటితో భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు. దీనికి కారణం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడమే. మే 7న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు తెలపగా, నేడు విరాట్ కోహ్లీ కూడా సైనింగ్ ఆఫ్.. అంటూ సోషల్ మీడియా వేదికాగా భారత టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీమిండియాను నడిపించిన ఇద్దరు దిగ్గజాలు వారంలోపే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వీరిద్దరి నిర్ణయాలు భారత క్రికెట్‌లో ఒక కొత్త శకానికి నాంది పలికాయి.
Read Also: Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్ బ్రేక్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ!
Also Read
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ఇకపోతే, విరాట్ కోహ్లీ 2015 నుండి 2022 వరకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా 68 మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు. ఈ సమయంలో భారత్ 40 మ్యాచ్‌లను గెలిచింది. 17 మ్యాచ్‌లను ఓడింది. అలాగే 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ గణాంకాలు కోహ్లీని భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలబెట్టాయి. అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్ కెప్టెన్సీలో అతని 40 విజయాలు గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాత నాల్గవ స్థానంలో నిలబెట్టాయి. కోహ్లీ నాయకత్వంలో, భారత్ 2018-19లో ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. అలాగే, 2021లో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. అతని నాయకత్వంలో, భారత్ 42 నెలల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కోహ్లీ కెప్టెన్సీలో 54.80 సగటుతో 5864 పరుగులు సాధించారు. అతను కెప్టెన్‌గా 20 శతకాలు సాధించి, భారత టెస్ట్ కెప్టెన్సీ చరిత్రలో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలిచారు. 2022లో కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ, అతని నాయకత్వం భారత టెస్ట్ క్రికెట్‌లో ఓ మైలురాయిగా నిలిచింది.
Read Also:RAPO22 : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. రిలీజ్ డేట్ ఫిక్స్.?
ఇక రోహిత్ విషయానికి వస్తే.. 2022లో విరాట్ కోహ్లీ రాజీనామా చేసిన తర్వాత, రోహిత్ శర్మ భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఆయన 24 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా.. ఇందులో 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రా మ్యాచ్‌లు ఉన్నాయి. రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌ను 61 మ్యాచ్‌లు ఆడి, 4,301 పరుగులు చేసి, సగటు 40.57తో ముగించారు. రోహిత్ కెప్టెన్ గా కొనసాగిన సమయంలో రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు చేరుకున్న విజయం సాధించలేకపోయారు.
ఇక వీరిద్దరి వీడ్కోలుతో, భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఇకపై భారత టెస్ట్ క్రికెట్ ను జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో, ఈ యువ ఆటగాళ్లు భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!