పశ్చిమ బెంగాల్ కోవిడ్ నిబంధనలను సడలించింది. వివాహాలకు 200 మంది ఒకేసారి గరిష్టంగా 200 మంది అతిథులతో వివాహ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి బెంగాల్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. శనివారం ఈ మేరకు కోవిడ్ -19 సడలింపులకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.బహిరంగ ప్రదేశాల్లో జాతరలు మరియు మేళాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని “ఓమిక్రాన్ వేరియంట్‌పై ఉన్న రిపోర్టులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర…
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా నిధులు ఇస్తోంది. రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 63 లక్షల తెలంగాణ రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో వ్యవసాయం కోసం అప్సులు తెచ్చుకునే బాధ చాలామటుకు తప్పుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని…
ఓవైపు కరోనా మహమ్మారి రూపం మార్చుకుని ఒమిక్రాన్‌తో విజృభింస్తుంటే చాలా మంది కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టా రాజ్యంగా తిరుగుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడ ఎవరూ మాస్క్ ధరించకపోయినా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ కెమెరాలకు పని చెబుతున్నారు. ఫోటో తీయడం వారికి జరిమానా విధించడం .. ఎక్కడ లాఠీలకు పనిచెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన రెండు రోజుల్లో కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 1.5 కోట్ల…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికే చాలా రాష్ట్రాలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి… దీంతో.. ఆయా రాష్ట్రాలు నిబంధనలు అమలు చేస్తున్నాయి.. కేసుల తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, తమ రాష్ట్రంలో కరోనా నింధనలు మరింత కఠినంగా అమలు చేయడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరింది తమిళనాడు ప్రభుత్వం.. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు రాష్ట్ర ప్రజారోగ్య…
ఓమిక్రాన్ వేరింయట్ వేగంగా వ్యాప్తి నేపథ్యంలో, కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి కేంద్రం జారీ చేసిన పరిమితులు/మార్గదర్శకాల జాబితా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. మాస్క్ ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. సంస్థలు లేదా దుకాణాలు మాస్క్ లేని వ్యక్తిని తమ ప్రాంగణంలోకి అనుమతిస్తే పరిస్థితి తీవ్రతను…
మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆమె.. గతంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఈ శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది కోర్టు.. ఆమె కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, మిలిటరీకి వ్యతిరేకంగా ఇతరులను ప్రేరేపించారని రుజువు కావడంతో ఈ తీర్పును వెలువరించింది ప్రత్యేక కోర్టు.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూకీపై అనేక ఆరోపణలు మోపబడ్డాయి.. వరుసగా అన్నింటిపై…
తెలంగాణలో నిన్న మొన్నటివరకూ కరోనా నియంత్రణలో వుంది. అయితే విదేశాలనుంచి విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. విదేశాలనుంచి వచ్చేవారి విషయంలో నియంత్రణ చేపట్టింది. అయితే, తెలంగాణలో కరోనా నియంత్రణకు ఎలాంటి పటిష్ట చర్యలు చేపట్టకపోవడం, కరోనా నియంత్రణకు మాస్క్ ధరించక పోవడంపై లోకాయుక్త సీరియస్ అయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టకకపోవడం, స్మోకింగ్ పై సుమోటోగా కేసు స్వీకరించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకాయుక్త. గుంపులుగా…
రాజధానిగా అమరావతిని అమలుచేయాలంటూ రైతులు, ప్రజాసంఘాలు చేపట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైసీపీ వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. వైసీపీ ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులిస్తున్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచేయాలనే…
మంత్రి ముద్దు వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.. చివరకు ఆయన పదవినే ఊడగొట్టే వరకు వెళ్లింది..! ఏంటి ముద్దుతో పదవులు కూడా పోతాయా? అనే అనుమానం కలుగొచ్చు… నిజమేనండి.. పూర్తి వివరాల్లోకి వెళ్లి పరిశీలిస్తే.. యూకే ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్.. తన సహాయకురాలికి కార్యాలయంలో ముద్దు పెట్టారు… ఈ ముద్దు భాగోతాన్ని సన్ వార్తాపత్రిక ప్రముఖంగా ప్రచురించింది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. హాంకాక్ ఆ ఘటనపై ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వివరణ ఇవ్వడంతో..…
ద్వారాక ఆర్టీసీ కాంప్లెక్స్ లో కోవిడ్ నిబంధనలు ఎక్కడ కానరావడం లేదు. కరోనా టెస్ట్ లు చేయించుకున్న తరువాత నేరుగా ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి వెళ్తున్నారు. దాని రిజల్ట్స్ రాకుండానే బయట తిరుగుతున్నారు ప్రజలు. బస్ స్టేషన్లో కనీసం శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. బస్సులో కూడా మాస్క్ లు పెట్టుకోకుండా నే ప్రయాణిస్తునన్నారు ప్రజలు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే ప్రస్తుతం ఏపీలో రోజుకు 7 వేలకు పైగా కరోనా…