తెలంగాణలో నిన్న మొన్నటివరకూ కరోనా నియంత్రణలో వుంది. అయితే విదేశాలనుంచి విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. విదేశాలనుంచి వచ్చేవారి విషయంలో నియంత్రణ చేపట్టింది. అయితే, తెలంగాణలో కరోనా నియంత్రణకు ఎలాంటి పటిష్ట చర్యలు చేపట్టకపోవడం, కరోనా నియంత్రణకు మాస్క్ ధరించక పోవడంపై లోకాయుక్త సీరియస్ అయ్యారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టకకపోవడం, స్మోకింగ్ పై సుమోటోగా కేసు స్వీకరించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకాయుక్త. గుంపులుగా తిరగడం, మాస్క్ లేకపోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసులు, హెల్త్, మునిసిపల్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని లోకాయుక్త సీరియస్ అయ్యారు.
యువకులు టీ స్టాళ్లు, బేకరీలు, ఫుడ్ స్టాల్ దగ్గర బాగా గుమిగూడుతున్నారు. కరోనా నియమనిబంధనలు కఠినంగా అమలు చేసి నివేదిక ఇవ్వాలని, కేసు విచారణ ఈ నెల 17 తేదీకి వాయిదా వేశారు లోకాయుక్త.