మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆమె.. గతంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఈ శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది కోర్టు.. ఆమె కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, మిలిటరీకి వ్యతిరేకంగా ఇతరులను ప్రేరేపించారని రుజువు కావడంతో ఈ తీర్పును వెలువరించింది ప్రత్యేక కోర్టు.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూకీపై అనేక ఆరోపణలు మోపబడ్డాయి.. వరుసగా అన్నింటిపై దర్యాప్తులు జరుగుతుండగా.. శిక్ష విధించడం అయితే ఇదే తొలిసారి..
Read Also: ఇప్పటికైతే ‘ఒమిక్రాన్’ టెన్షన్ తప్పింది..! ఆమెకు నెగెటివ్
అయితే, ఆంగ్ సాన్ సూకీ, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలను మిలిటరీ నిర్బంధించిన అనంతరం.. ఆమె పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో వివాదాస్పద పోస్టులు దర్శనమిచ్చాయి. దానిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, సూకీ తప్పుచేశారని తేల్చారు. ఇక, 2020 నవంబర్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడానికి ముందు.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కూడా సూకీపై కేసు నమోదైంది.. ఆ ఎన్నికల్లో వరుసగా రెండోసారి సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్డెమొక్రసీ పార్టీ విజయం సాధించింది.. కానీ, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.. అనంతరం సైన్యం తిరుగుబాటు చేయడం.. సూకీ సహా నేతలను నిర్బంధించడం.. అది కాస్త హింసకు దారితీయడం.. ఇలా చాలా పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే.