భారత్ జోడో యాత్రపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కోవిడ్ ఆందోళనకర పరిస్థితులు ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లేఖ రాశారు.
Taj Mahal: ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే మన దేశంలో ఎక్కువ మంది సందర్శించిన చారిత్రక కట్టడంగా తాజ్‌మహల్ టాప్‌లో నిలిచింది. టికెట్ల కొనుగోళ్ల ద్వారా 25 కోట్ల రూపాయలకు పైగా ఇన్‌కమ్‌ని సంపాదించింది. అంటే నెలకు యావరేజ్‌గా 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చైనాలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. చైనా, తైవాన్, ఈజిప్టు లో కేసులు పెరుగుతున్నాయని, ఢిల్లీ, హర్యానా, యూపీ లో కేసుల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో నాలుగు నుంచి ఆరు వారాల్లో ఎలాంటి…
ఓ వైపు కరోనా విజృంభిస్తోంది.. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది.. కానీ, ఇదే సమయంలో ఓ పార్టీ జరిగింది.. అది కూడా ప్రధాని నివాసం ఉన్న వీధిలోనే.. ఇదే ఇప్పుడు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను చిక్కుల్లో పడేసింది… ఆయన నివాసం ఉండే డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన ఓ పార్టీ వ్యవహారంలో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను రాశారు.. వాటికి సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల డెడ్‌లైన్ పెట్టారు.. ఈ…
శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. శివరాత్రి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఆయన ఆదేశించారు. ఫిబ్రవరి 22 నుండి వచ్చే మార్చి 4 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలతో బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలన్నారు హరిజవహర్ లాల్. ప్రతి భక్తుడు మాస్క్ దరించేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలన్నారు హరిజవహర్ లాల్. జిల్లా అధికారుల సహకారంతో నడకదారి వచ్చే…
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. అయితే తెలంగాణ లో కోవిడ్ ఆంక్షలు జనవరి 31 నాటికి ముగిశాయి. కానీ కోవిడ్ ఆంక్షల గడువు పెంచలేదు ప్రభుత్వం. మళ్ళీ ఆంక్షలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు సర్కార్. బహిరంగ సభలు, ర్యాలీల పై నిషేధిస్తూ రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ జనవరి ఒకటి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో, మాల్స్, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ ను తప్పని…
కరోనా మళ్లీ పంజా విసరడంతో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి.. కానీ, కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను అనుగుణంగా మళ్లీ ఆంక్షలను సడలిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా వైరస్ కేసుల కారణంగా మూసివేసిన తమిళనాడులోని స్కూళ్లు, కాలేజీలు ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఇక అంతేకాదు.. ఇప్పటికే అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ.. రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. అలాగే, ఈ ఆదివారం (జనవరి 30)…
విశాఖ జిల్లాలో సినిమా హాళ్ళలో కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో యజమానులు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వివిధ నిబంధనల పేరుతో థియేటర్లకు అధికారులు నోటీసులు జారీచేయడం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము థియేటర్లను నడపలేం అంటున్నారు యజమానులు. ఇప్పటికే కరోనా వల్ల దివాలా తీశామని, ప్రభుత్వం విధించే ఆంక్షలతో థియేటర్లు మూసివేయడమే శరణ్యం అంటున్నారు.
కరోనా ప్రస్తుత పరిస్థితితో మరోసారి ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కూడా తమ రాజధాని నగరం అబుదాబిలోకి ప్రవేశించాలంటే కొన్ని ఆంక్షలను తప్పనిసరి చేసింది. బూస్టర్ డోసు తీసుకున్న వారినే అబుదాబిలోకి అనుమతిస్తామని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకుంటేనే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు పరిగణించనున్నట్టు…
తిరుమలలో కోవిడ్ నిబంధనలు సామాన్య భక్తులుకేనా? VIPలకు లేని ఆంక్షలు వారికే ఎందుకు? ముక్కోటి ఏకాదశి మొదలుకొని.. మిగతా రోజులవరకు కోవిడ్ పేరుతో సామాన్యలు శ్రీవారి దర్శనానికి దూరం కావాల్సిందేనా? ఏడాదిన్నరగా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం..!అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలస్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. వారికి కావల్సిందల్లా.. శ్రీవారి దర్శనమే. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు.. సిఫారసులు ఉండవు. తమను గట్టెక్కించే స్వామివారు గుర్తుకొస్తే చాలు…