సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికే చాలా రాష్ట్రాలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి… దీంతో.. ఆయా రాష్ట్రాలు నిబంధనలు అమలు చేస్తున్నాయి.. కేసుల తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, తమ రాష్ట్రంలో కరోనా నింధనలు మరింత కఠినంగా అమలు చేయడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరింది తమిళనాడు ప్రభుత్వం.. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు సెల్వ వినాయగం..
Read Also: ఏపీలో సీజేఐ 3 రోజుల పర్యటన.. తొలిసారి స్వగ్రామానికి..!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడడంతో.. ఆ వైరస్ వ్యాప్తి నిరోధానికి మునుపటి కరోనా నిరోధక నిబంధనలలో కొన్నింటిని అమలు చేస్తే బాగుంటుందని లేఖలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైందని.. మరో 28 మందికి వైద్యపరీక్షలు జరుపుతున్నామన్న ఆయన.. ఈ నేపథ్యంలో మరింత కఠిన కరోనా నిబంధనలు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. మరి తమిళనాడు విజ్ఞప్తిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిన పోతున్న విషయం తెలిసిందే.