తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా నిధులు ఇస్తోంది. రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 63 లక్షల తెలంగాణ రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో వ్యవసాయం కోసం అప్సులు తెచ్చుకునే బాధ చాలామటుకు తప్పుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల పదవ తారీఖు వరకు కొన్ని పరిమితుల ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ నిబంధనలతో ర్యాలీలకు, ఊరేగింపులకు అనుమతి లేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి వరకు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ రైతు బంధు ఉత్సవాలు జరుపు కోవాలని సూచించారు. రైతుబంధు ఉత్సవాల సందర్భంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని మరోసారి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.