ఇంద్రవెల్లి సభ తర్వాత కాంగ్రెస్ ఆలోచన మారిందా? పార్టీతో కలిసి ప్రయాణం చేయకపోతే.. కాంగ్రెస్లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న సంకేతాలు పంపుతోందా? మారిన వైఖరిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంద్రవెల్లి సభకు రాని నేతలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. సీనియర్ నాయకులకు కేరాఫ్ అడ్రస్. అలాంటిది పదేళ్ల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ముఖ్యులు అనుకున్నవారు తమకు భవిష్యత్ బాగుంటుంది అనుకున్న…
హుజురాబాద్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగేది ఎవరు? బలమైన వ్యక్తి అనుకున్న నేత చేతులు ఎత్తేశారా? పార్టీ గాలం వేసిన వ్యక్తి కారెక్కేశారా? ప్రధానపక్షాలు క్లారిటీతో ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అభ్యర్ధిని తేల్చుతుందా.. నాన్చుతుందా? హుజురాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికకు పార్టీలు సిద్ధం. ప్రచారం హోరెత్తిపోతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. అనేక వడపోతల తర్వాత TRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస…
టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి… ఇంద్రవెల్లి సభ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. రేవంత్ లాగా పగతోని.. ప్రతికారంతో రాజకీయం చేస్తే ఆయన రోడ్డుపై తిరగగలడా? అని ప్రశ్నించారు.. రేవంత్ దిగజారిన భాష చూసి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగి పోతున్నారన్న సైదిరెడ్డి.. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు మహా దేవత అంటున్నారు అని ఎద్దేవా చేశారు.. సీఎం కేసీఆర్…
ఆదివాసీ లను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి లో ఎలా సభ పెడుతుంది అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ప్రశ్నించింది. మా పండగ రోజు రాజకీయ సభకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ , రాష్ట్రప్రభుత్వందే భాద్యత అని తెలిపింది. ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కే రెండు సార్లు మోసం చేసింది. ఇప్పుడు మూడో సారి మా ఆదివాసీ దినోత్సవాన్ని హైజాక్ చేస్తోంది. 1976 లో కాంగ్రెస్ పార్టీ…
1981 ఏప్రిల్ 20వ తేదీన జల్.. జంగల్.. జమీన్.. కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటన 40 ఏళ్లు పూర్తిచేసుకుంది.. అయితే, ఇప్పుడు ఇంద్రవెల్లి దండోరాతో ప్రస్తుత ప్రభుత్వాన్ని మోసాన్ని ఎండగతాం అంటోంది.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… దీనిపై పలురకాలర విమర్శలు వినిపిస్తున్నాయి.. వీటిపై ఎన్టీవీతో మాట్లాడిన…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. రేవంత్ రెడ్డి ఎన్టీవీకి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 7:30 కి ప్రచారం కానుంది.
కల చెదిరింది. అనుకున్నది చెయ్యి దాటింది. వాటి గాయాలు మాత్రం మానలేదు. ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఎవరిదారి వారిదే అనుకుంటున్నారో ఏమో కీలక సమావేశానికి డుమ్మా కొట్టేశారు. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకీ ఎవరా నాయకులు? హుజురాబాద్ ఉపఎన్నిక సన్నాహక భేటీకి డుమ్మా! ఒకరు మొదట్లో పీసీసీ పదవి వస్తే తీసుకోవాలని అనుకున్నారు. ఇంకొకరు వద్దనుకున్నా.. నువ్వే పీసీసీ చీఫ్.. మేడం ఒకే అనేశారు అని సైలెంట్గా ఉన్న నాయకుడిని లేపి…
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపైతంపై దృష్టిసారించిన ఏఐసీసీ.. ఏపీ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నెల 11న రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నారు. విడివిడిగా సీనియర్ నేతలతో రాహుల్ మాట్లాడనున్నారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో కూరుకుపోయింది. పార్టీని నడిపించే నాథుడులేక బలహీనపడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత బలహీనమైన కాంగ్రెస్ ఇంతవరకూ కోలకోలేదు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ను ముందుకు ఎలా తీసుకెళ్లాలి?…
కొత్త పీసీసీని ప్రకటించగానే ఆయన తన పదవులన్నిటికీ రాజీనామా చేశారు. అయినప్పటికీ పార్టీ ఆయనతో మాట్లాడుతూనే ఉంది. ఆ నాయకుడు మాత్రం గడప దాటడం లేదు. పాతచోటే ఉంటారా.. లేక కొత్త గూటిని వెతుక్కునే పనిలో పడ్డారా అన్నది అంతుచిక్కడం లేదట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత మౌనంగానే ఉండిపోయారు! తెలంగాణలో ఆయారాం గయారాంల సందడి పీక్కు చేరుకుంటోంది. గోడ దూకేవాళ్లు దూకేస్తున్నారు. మెడలో కొత్త కండువాలు కప్పేసుకుంటున్నారు. కొందరు…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ… ఈ మధ్యే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పీసీసీ చీఫ్ పదవితో పాటు.. వివిధ కమిటీలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.. ఇక, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చిందనే టాక్ నడుస్తోంది.. మరోవైపు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… వారికి పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. ఈ…