CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ( అక్టోబర్ 25న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్ర నేతలతో ఆయన కీలక సమావేశం జరిపే అవకాశం ఉంది.
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం భారత ఎన్నికల కమిషన్‌కు 40 మంది ప్రముఖ నేతల పేర్లను పంపారు. ఈ జాబితాలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత పీ. విశ్వనాథ్,…
Off The Record : కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోయినట్టేనంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలిచి మాట్లాడాక ఎపిసోడ్ మొత్తం సెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో సురేఖ… మురళి చేసిన లొల్లి కంటే….. వాళ్ళ కూతురు సుస్మిత చేసిన గొడవే పెద్ద రచ్చకు దారి తీసింది. పైగా ఇది బీసీ వర్సెస్ రెడ్లు టర్న్ అవుతోందన్న సంకేతాలు…
Konda Surekha : రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ లను కలిశారు. ఈ భేటీలో గత కొద్ది రోజులుగా తాను ఎదుర్కొంటున్న పరిణామాలను మంత్రి సురేఖ వివరించారు. సమావేశంలో ఆమె తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, పోలీసుల చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా, నిన్న రాత్రి తన…
ఢిల్లీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎన్టీవీతో మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైందన్నారు.
కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధిష్టానానికి ఓ మంత్రి పై కొండా మురళీ ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో ఆ మంత్రి మితిమీరిన జోక్యం, మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో మాట్లాడిన కొండా మురళీధర్‌రావు.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు. Also Read:Rain Alert to Telangana…
StoryBoard: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కష్టాలు కొనితెచ్చుకుంటోంది. సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం మంత్రి పదవులు పొంది నేతలు.. కలిసికట్టుగా ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సిందిపోయి.. తమలో తామే కలహించుకుంటున్నారు. పోనీలే బయటపడటం లేదుగా అని ఇన్నాళ్లూ పార్టీ క్యాడర్ సరిపెట్టుకుంది. కానీ ఆ ఊరట కూడా వారికి దక్కకుండా చేస్తూ.. మంత్రి పొన్నం ప్రభాకర్.. తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై రెచ్చిపోయారు. ఏకంగా దున్నపోతు అంటూ నోరుపారేసుకున్నారు. అదీ ప్రెస్మీట్లో ఈ ఘటన జరగడంతో..…
తెలంగాణలో బలహీన వర్గాల (BC) కోసం 42% రిజర్వేషన్ల జారీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఆయన తెలిపారు.
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అధికార పార్టీ కావడంతో… గెలుపు ఈజీ అని లెక్కలేసుకుంటూ… ఎవరికి వారు రేస్‌లోకి దూసుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం డివిజన్స్ వారీగా పని మొదలుపెట్టింది. ఈ గ్రౌండ్ వర్క్ చూస్తున్న చాలామంది ఆశావహుల పొలాల్లో మొలకలొస్తున్నాయట. వాళ్ళు చేస్తున్న హడావిడితో… పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అంతకు మించి పార్టీలో గందరగోళ వాతావరణం ఎక్కువ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్స్ విషయంలో…