ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ పేరుతు భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది… ఇక, దానికి కొనసాగింపుగా… తర్వాత సభ ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా నిర్వహిస్తామంటూ… ఇంద్రవెల్లి సభ వేదికగా ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అయితే, ఇప్పుడా సభను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ… ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను రద్దు చేసిన టి.పీసీసీ.. మహేశ్వరం నియోజక వర్గంలోకి సభను మారుస్తూ నిర్ణయం తీసుకుంది… అయితే, తేదీలో మాత్రం ఎలాంటి మార్పులేదు.. ఈ నెల 18వ తేదీననే మహేశ్వరం నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా సభ నిర్వహించనున్నారు.
ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన సభకు రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది… ఒకటి పోలీసులు సభకు అనుమతి నిరాకరించడం అయితే.. మరొకటి.. స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… ఈ సభ ఏర్పాటుపై అసంతృప్తితో ఉండడమేనని చెబుతున్నారు.. తనకు సమాచారం ఇవ్వకుండా సభ ఏర్పాటు పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి అలకబూనిననట్టు కూడా తెలుస్తోంది.. దీంతో.. నియోజకవర్గాన్ని మార్చేసిన పీసీసీ.. మహేశ్వరంలో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది.. అయితే, మహేశ్వరం నియోజకవర్గంలో ప్లేస్ ఎక్కడ అనేది తెలియాల్సి ఉంది.. మొత్తంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నుంచి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి మారిపోయింది దళిత గిరిజన దండోరా సభ. కాగా, రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇవ్వడంపై ఆదిలో బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఆ తర్వాత ఇకపై పార్టీ విషయాలపై తాను మాట్లాడబోనని ప్రకటించారు.. ఇక, ఫోకస్ మొత్తం పార్టీ అభివృద్ధిపైనే అని ప్రకటించారు.. కానీ, ఇబ్రహీంపట్నం సభ విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చగా మారింది.