గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఓ ఎమ్మెల్యే.. ఉన్నట్టుండి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. దీంతో.. ఈ పరిణామన్నా సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్టానం.. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఘటన అసోంలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్.. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు.. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం.. వెంటనే షోకాజ్…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శరద్‌పవార్‌తో,గాంధీ కుటుంబంతో జరుపుతున్న మంతనాలు,ప్రతిపక్ష నేతల సమావేశం,రేపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢల్లీి పర్యటన వంటి అంశాలు ఇప్పుడుమీడియాలో ప్రముఖ స్థానం ఆక్రమిస్తున్నాయి.ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి ఎన్‌డిఎ కూటమికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారనేది ఒక అభిప్రాయం. అందుకు సంబంధించిన సంప్రదింపులలో కాంగ్రెస్ మొదట పాల్గొనకపోవడంపై వ్యాఖ్యలు వచ్చాక ఆయన నేరుగా సోనియా రాహుల్ తదితరులతో చర్చలు జరిపివచ్చారు. ఇప్పుడు మమతా…
పార్లమెంట్లో రైతు చట్టాలపై వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. రైతు చట్టాలను బ్యాన్ చేయాలని ఇప్పటికే రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించారు. పార్లమెంట్ ముట్టడిని మొదట ప్రకటించినప్పటికీ, ఆ తరువాత ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది.…
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ని కత్తి కార్తీక కలిశారు. ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మధుయాష్కీకి శుభాకాంక్షలు తెలిపారు కత్తి కార్తీక. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈ సందర్భంగా కత్తి కార్తీకను ఆహ్వానించారు మధుయాష్కీ. అయితే.. ఈ ఆఫర్ పైకత్తి కార్తీక సుముఖత వ్యక్తం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు ఈ అంశంపై రేవంత్ రెడ్డితో మధుయాష్కీ చర్చించినట్లు సమాచారం. బీసీ మహిళ, తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలైన కత్తి కార్తీకను పార్టీలోకి…
కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారా? కర్టసీ కోసం టచ్‌లోకి వెళ్తున్నారా.. లేదంటే ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారా? అప్పట్లో కాదని వెళ్లిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనక్కి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? లెట్స్ వాచ్! పార్టీ మారిన ఎమ్మెల్యేలు టచ్‌లోకి వస్తున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ సింబల్ మీద గెలిచి.. ప్లేట్ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై.. కొత్త పీసీసీ చీఫ్ వచ్చి రాగానే మాటల తూటాలు పెంచారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు.. కౌంటర్ అటాక్ చేసినా……
దేశంలోని అన్నిరాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్‌కి నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీని నిర్వహించి రాజ్‌భవన్ ముందు ఆందోళన నిర్వహించి గవర్నర్‌కు వినతి పత్రం అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందిరాపార్క్ వద్దకు చేరుకున్నారు. వర్షాన్నిసైతం లేక్కచేయకుండా ఈ కార్యక్రమాన్ని…
ఇజ్రాయిల్‌కు చెందిన పెగసిస్ స్పైవేర్ పార్లమెంట్‌ను కుదిపేయబోతుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఈరోజు రాజ్యసభలో కోవిడ్ పై చర్చజరగాల్సి ఉన్నది. అయితే, రాజ్యసభలో జరగాల్సిన అన్ని చర్చలను పక్కన పెట్టి పెగసిస్ స్పైవేర్ పై చర్చను జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచారని ప్రపంచంలోని పలు మీడియా సంస్థలు కథనాలగా పేర్కొన్నాయి. ఇండియాకు చెందిన 300 మందిపై నిఘా ఉంచారని ఆయా మీడియాలు పేర్కొన్నాయి. Read:…
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చే ఆలోచనలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొన్ని ప్రధానమైన అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఒక పార్టీ నుండి… ఇంకో పార్టీకి వలసలు సహజమయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిని కూడా కలుపుకుని పోవాలని రేవంత్ భావిస్తున్నారు. దీంట్లో భాగంగా పార్టీలోకి నాయకులను ఆహ్వానించే పనిలో పడ్డారు. పార్టీలోకి ఎవరిని…
సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని… రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా రేవంత్ ను అడ్డుకున్నారని… ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ కు వచ్చే సభ్యుడిని అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కి ఉన్న ప్రజాస్వామ్య హక్కులను టిఆర్ఎస్ కాలరాస్తుందని…తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహణను 100 రోజుల నుంచి…
పంజాబ్ పిసిసి అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే… నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా నియమించింది ఏఐసిసి అధిష్ఠానం. వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా సంగత్ సింగ్ గిలిజియన్, సుఖవీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, కుల్జీత్ సింగ్ నగ్రా లను నియామకం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు నియామకాలను ఆమోదిస్తూ ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.