టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి… ఇంద్రవెల్లి సభ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. రేవంత్ లాగా పగతోని.. ప్రతికారంతో రాజకీయం చేస్తే ఆయన రోడ్డుపై తిరగగలడా? అని ప్రశ్నించారు.. రేవంత్ దిగజారిన భాష చూసి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగి పోతున్నారన్న సైదిరెడ్డి.. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు మహా దేవత అంటున్నారు అని ఎద్దేవా చేశారు.. సీఎం కేసీఆర్ ఒక్కమాట అంటే రేవంత్ రోడ్లపై తిరగలేడు అని కామెంట్ చేశారు.
మాకు కేసీఆర్ సంస్కారం నేర్పారు.. రేవంత్ కన్నా ఎక్కువ మాట్లాడ గలం అన్నారు సైదిరెడ్డి… హుజూర్ నగర్‌లో నియోజకవర్గానికి సంబంధించి లక్ష మందితో సభ పెట్టే సత్తా నాకుందని.. ఇంద్రవెల్లి సభ ఓ లెక్కా ? అని ఎద్దేవా చేశారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ విద్యలు ఇక నడవవని హెచ్చరించిన ఆయన.. రేవంత్ రెడ్డి టీపీసీసీ రాగానే అక్కడి సీనియర్లు అందరూ మధనపడుతున్నారని తెలిపారు.. రేవంత్ రెడ్డి తనను తాను హైలైట్ చేసుకోవడానికి సభ పెట్టినట్లు ఉందని.. ఇంద్రవెల్లి సభకు 10 వేల మంది వచ్చారా..? లేదా లక్షమంది వచ్చారా…? అనేది అందరూ చూశారన్నారు. రేవంత్ రెడ్డి తన చరిత్ర మరిచి విమర్శలు చేస్తున్నారని.. జనంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలనే మాటలు తప్ప ఏమీ లేదన్నారు సైదిరెడ్డి.