తెలంగాణలో దళిత అధికారులకు ప్రాధాన్యత లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రావిర్యాల దళిత దండోరా సభలో వ్యాఖ్యానించాడు. వర్షంలో తడుస్తూనే రేవంత్‌రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ.. దళితులకు దళితబంధు అంటూ కేసీఆర్ మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారు. ఓట్ల అవసరమైతేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడని ఆరోపించారు. కేసీఆర్‌ను దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందని.. ఇప్పుడే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
నీకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు నీ మోచేతి నీళ్ళు తాగుతారు. కానీ తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది.. కేసీఆర్ హాయంలో ఉద్యోగాలు వచ్చాయా.. పావలా వడ్డీలు వచ్చాయా.. కానీ కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయి. అమరుల కుటుంబాలకు ఏమొచ్చిందంటూ అంటూ రేవంత్ ప్రశ్నించారు. సోనియాగాంధీ ప్రజల కోసం తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ తన కుటుంబం కోసం తెలంగాణను వాడుకుంటున్నారని విమర్శించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్ హుజూరాబాద్ ప్రజల చేతిలో ఉంది.. అలోచించి ఓట్లు వేయండి’ అంటూ రేవంత్ రెడ్డి కోరాడు.