కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కెసిఆర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళేనని… వైఎస్ఆర్, చంద్రబాబు, కెసిఆర్ లాంటి నాయకులను కూడా యూత్ కాంగ్రెస్ అందించిందన్నారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో చూస్తామని తెలిపారు. టికెట్ తీసుకుని జనం లోకి పోతా అంటే… ఓడిపోతారని పేర్కొన్న రేవంత్… పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా మారిపోతారని తెలిపారు. చేతికి మట్టి అంటకుండా పనిచేసే యూత్ కాంగ్రెస్ నాయకున్ని అంటే ఎవరు పట్టించుకోరన్నారు. శివసేన రెడ్డీ కాలు చిప్ప పగల గొట్టుకుంటే… రాహుల్ గాంధీ పక్కన కూర్చున్నాడని… పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ కి ఎవరు ఓనర్లు లేరని… ఎవరు కష్టపడితే వాళ్ళే ఓనర్స్ అని తెలిపారు. కష్ట పడటానికి సిద్దం కావాలని నాయకులకు పిలుపు నిచ్చారు రేవంత్ రెడ్డి.