సంగారెడ్డిలో నేడు తెలంగాణ జనసమితి పార్టీ రెండవ ప్లీనరీ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ వివిధ జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. భూమి ఇచ్చేవారి బతుకు బాగు పడాలని కోరుకుంటున్నామని, నీమ్జ్ ప్రాజెక్టు రాకూడదని రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళామన్నారు. సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై కూడా పోరాటం చేశామని, కాళేశ్వరం ఎత్తి పోత పథకం వల్ల వేల ఎకరాల పంట భూములు మునిగి పోతున్నాయన్నారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్రవిమర్శలు చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ ను బీజేపీ గళ్ళ పట్టి గుంజుతేనె బయటకు వచ్చాడన్నారు. జైలుకు పోతానన్న భయంతోనే దేశంలో కెసిఆర్ తిరుగుతున్నాడు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేసి తీరుతాం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్ళు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు రోజులు మహిళా దినోత్సవ కార్యక్రమం శుభపరిణామం అన్నారు మంత్రి తలసాని. తాగునీటి కోసం మహిళలు అనేక ఇబ్బందులు పడేవారు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రసూతి మహిళలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలను 50 శాతం పెంచాం. పేద, మధ్య తరగతి మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.. దీనిపై గవర్నర్ తమిళసై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు రేపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది.. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ 2022-23కి ఆమోదం తెలుపనున్నారు. మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్…
ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. ఏ చర్చకైనా మేం సిద్ధం అన్నారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిపల్లిలో రైతు వేదిక ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చని పంటపొలాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతుందన్నారు. దేశంలో ఒక్క రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ఉంది.. దేశంలో ఇంతకంటే మంచి పథకాలు ఎక్కడైనా ఉంటే మేము రాజీనామా చేస్తామని సవాల్…
అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి జగదదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ చేస్తున్నా మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వ పథకాలకు కొబ్బరి కాయలు కొట్టకుండ, అభివృద్ధికి నిధులు తేవాలన్నారు.. అభివృధి అంటే కేసీఆర్ నియోజకవర్గానికి 6 వరసల రోడ్లు కాదు, మా మునుగోడు నియోజకవర్గానికి వేసి చూపించాలన్న ఆయన..…
జాతీయస్థాయిలో మరో కొత్త ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.. అయితే, కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండబోదని స్పష్టం చేశారు. ఏదేమైనా మరో ఫ్రంట్‌పై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు డైరెక్టర్ (ప్రశాంత్ కిషోర్) పీకే, ప్రొడ్యూసర్ నరేంద్ర మోడీ.. నటుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా…
మూడు రోజులు తెలంగాణలో తమాషా కార్యక్రమం జరగబోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి అన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మహిళలు బతుకుతున్నారు అనే విధంగా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌లో మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ ను పొగడడం ఆశ్చర్యం వేసిందని ఆమె అన్నారు. ఎంపీ మాలోతు కవిత ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయిందా.. కాంగ్రెస్ బిక్ష వల్లే కవిత రాజకీయాల్లో ఉందని ఆమె విమర్శించారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే ఆడ పిల్లలకు…
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నేడు ములుగులో మంత్రి హరీశ్‌రావు ఈ సర్వేను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 18 ఏండ్లు నిండిన 7 లక్షల మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఇందుకోసం ములుగు జిల్లాలో 153 హెల్త్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సర్వే ప్రక్రియను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని…
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ నారాయణ పేట జిల్లా నుంచి పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్న సీఎం కేసీఆర్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చర్చల్లో ఉండటానికి ఢిల్లీ, జార్ఖండ్ వెళ్లారన్న ఆయన.. ప్లీజ్ నన్ను కలవండని బ్రతిమిలాడుకుంటున్నారు…