Congress Leader Ravali : తెలంగాణలో 3 రోజులు తమాషా జరగబోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు రోజులు తెలంగాణలో తమాషా కార్యక్రమం జరగబోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి అన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మహిళలు బతుకుతున్నారు అనే విధంగా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌లో మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ ను పొగడడం ఆశ్చర్యం వేసిందని ఆమె అన్నారు. ఎంపీ మాలోతు కవిత ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయిందా.. కాంగ్రెస్ బిక్ష వల్లే కవిత రాజకీయాల్లో ఉందని ఆమె విమర్శించారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినట్లు.. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే పిల్లలు పుడుతున్నట్లు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇంట్లోంచి పెన్షన్లు ఇస్తున్నారా.. ఎందుకు రాఖీ కట్టాలని ఆమె ప్రశ్నించారు.
టీఆర్ఎస్ మద్యం పాలసీ వల్ల.. ఎంతో మంది ఆడబిడ్డల తాళి బోట్లు తెగాయని ఆమె మండిపడ్డారు. ఖమ్మంలో 6 సంవత్సరాల బాలికపై నాన్ బెయిల్ కేసు పెట్టిన విషయం టీఆర్ఎస్ నేతలు మర్చిపోయారా అని, గిరిజన మహిళా రైతులను చెట్లకు కట్టేసి కొట్టిన చరిత్ర టీఆర్ఎస్‌ది అని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బంధు కాదు.. మహిళా రాబందు ప్రభుత్వం టీఆర్ఎస్ అంటూ ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. నామినేటెడ్ పోస్ట్ లలో ఎంతమంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని, టీఆర్ఎస్ సంబరాలను బైకాట్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!