సంగారెడ్డిలో నేడు తెలంగాణ జనసమితి పార్టీ రెండవ ప్లీనరీ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ వివిధ జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. భూమి ఇచ్చేవారి బతుకు బాగు పడాలని కోరుకుంటున్నామని, నీమ్జ్ ప్రాజెక్టు రాకూడదని రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళామన్నారు. సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై కూడా పోరాటం చేశామని, కాళేశ్వరం ఎత్తి పోత పథకం వల్ల వేల ఎకరాల పంట భూములు మునిగి పోతున్నాయన్నారు. నిరుద్యోగ సమస్య పై నిరంతరం పోరాటం చేస్తున్నామని, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి మా కార్యకర్తలు ముందున్నారని ఆయన వెల్లడించారు.
భూములు గుంజుకోవడంలో ఎనుకటి జమీందార్లను మించిపోయారని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో భూములకు రక్షణ లేదని, రాష్ట్ర ఖజానాను ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు పెట్టి, కమిషన్ కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు. చట్టం అందరి దృష్టిలో సమానంగా పని చేయాలని, తెలంగాణలో జనసమితి సభ కోసం పర్మిషన్‌కు వెళితే లెక్క లేనన్ని సార్లు పోలీసులు రిజెక్ట్ చేశారన్నారు. ఇక్కడ ప్లీనరీ లో ఉన్నా వారు అనేక ఉద్యమల్లో పాల్గొని వచ్చిన వారని, జనసమితికి హుజురాబాద్ ఎన్నికల్లో మలినం లేని ఓట్లు పడ్డాయని ఆయన అన్నారు.