యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు 10 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10న ఎదుర్కోలు, 11న కల్యాణం, 12న రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు విష్వక్సేనా ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి స్వయంభు దర్శనభాగ్యం…
నేడు పోలవరంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్, ఏపీ సీఎం జగన్‌లు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్, పునరావాస కాలనీలను పరిశీలించనున్నారు. నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ జరుగనుంది. మొహాలీ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌లో నేటి నుంచి మహిళల ప్రపంచకప్ జరుగనుంది. తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడనుంది. నేడు జార్ఖండ్‌కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌తో సీఎం కేసీఆర్…
చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. అందులో భాగంగా రేపు జార్ఖండ్ పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్.. శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లినున్న ఆయన.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీకానున్నారు.. ఇక, వారి అధికారిక నివాసంలో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నివాసంపై దుండగులు రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కథ స్క్రీన్ ప్లే అంత సీఎం ఆఫీస్ నుండే జరిగిందన్నారు. సినిమా రిలీజ్ కాకా ముందే కథ అడ్డం తిరిగింది. కొందరు ఐపీఎస్ అధికారుల తీరు ను చూసి కింది స్థాయి పోలీసులు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు. సీఎం కి కొమ్ముకాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, నిన్న జరిగిన ఘటనకు…
కాంగ్రెస్..కిసాన్ కాంగ్రెస్ కలిసి కార్యాచరణ చేపడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 5న సివిల్ సప్లయ్ మంత్రిని కలుస్తామని, వరి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరుతామని ఆయన వెల్లడించారు. 6న మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. శాసన సభలో రైతుల అంశాన్ని… షార్ట్ డిస్కషన్ కోసం ప్రయత్నం చేస్తామని, గవర్నర్ ని కలిసి వడ్ల…
మా నాయకుల పరువు తీసే ప్రయత్నం చేశారు.. దీనిపై సీఎం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి కేసులు, పత్తాల కేసులు, రేప్ కేసులు, కబ్జా కేసులు అన్నింటిలో టీఆర్‌ఎస్ నేతలే ఉన్నారని ఆయన విమర్శించారు. పోలీసులు ఢిల్లీలో ఇంటి పై ఎలా దాడి చేస్తారని, బరి తెగించి ఉన్నామని సమాజానికి చెపుతున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని, కేసు పెట్టిన జితేందర్…
ఇప్పటికే ఐఏఎస్ అధికారుల విషయంలో రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.. ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లలో పక్షపాత వైఖరి సరికాదని సూచించారు.. బీహార్ అధికారులే మీకు నచ్చడం.. మెచ్చడం వెనక ఉద్దేశం ఏంటి..? అని లేఖలో ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి… DOPT నిబంధనలకు వ్యతిరేకంగా సోమేష్ కుమార్‌ని ఎలా సీఎస్‌ను చేశారని నిలదీశారు.. HMDA, RERAలో అరవింద్, సోమేష్ కుమార్ ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపించాలని…
తెలంగాణలో టీఆర్ఎస్ పై యుద్ధం చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. డీజీపీ మహేందర్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా శాఖ అధ్యక్షులు, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం కాదన్నారు మహేందర్ రెడ్డి. మా ఇంట్లో జారిపడిన సంఘటనలో నాకు ఎడమ భుజం పైన బోన్ (SCAPULA ) కు మూడు చోట్ల Hairline fractures జరిగాయని ఎక్స్ -రే,…
20 ఏళ్ళ కోసం ప్లాట్లు చేసి… అమ్మితే వివరాలు ధరణి లో లేవు. 20 ఏళ్ళ తర్వతా కూడా ధరణిలో పాత యజమాని పేరు రావడంతోనే హత్యలు జరుగుతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ తప్పుడు నిర్ణయాల వల్ల నిన్న హత్యలు జరిగాయి. పాత భూ యజమానులకు హక్కులు ఇవ్వడం ఏంటో..? ధరణిని అడ్డం పెట్టుకొని… హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అక్రమాలు జరుగుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ నమూనా పోయింది.బీహార్ నమూనా వచ్చేసింది. కేసీఆర్…
సీఎం కేసీఆర్ నాయకత్వం లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నాం. 2500 మెట్రిక్ టన్నుల నుండి 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు కలెక్ట్ చేస్తున్నారు. 4500 స్వచ్ఛ ఆటోలను చెత్త కలెక్షన్ కోసం వాడుతున్నాం అన్నారు మంత్రి కేటీఆర్. పీపుల్స్ ప్లాజా వద్ద 20 మొబైల్ SCTP వాహనాలను ప్రారంభించారు మంత్రి కేటిఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పాల్గొన్నారు. కొద్ది…