ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. ఏ చర్చకైనా మేం సిద్ధం అన్నారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిపల్లిలో రైతు వేదిక ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చని పంటపొలాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతుందన్నారు. దేశంలో ఒక్క రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ఉంది.. దేశంలో ఇంతకంటే మంచి పథకాలు ఎక్కడైనా ఉంటే మేము రాజీనామా చేస్తామని సవాల్ విసిరిన ఆయన.. దీనిపై ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం అన్నారు..
Read Also: Komatireddy: కాంగ్రెస్ ఏమైనా సప్లయ్ కంపెనీయా..? కోమటిరెడ్డి ఫైర్
కాశీలో వెయ్యి కోట్లు పెడితే.. ఎంపీగా నీ పార్లమెంటు పరిధిలోని వేములవాడకు ఒక వంద కోట్లు తెచ్చే తెలివి ఏమైంది అంటూ బీజేపీ ఎంపీపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్.. ఏది పడితే అది అడ్డంగా మాట్లాడితే చెల్లుబాటు అవుతుందా…? అని నిలదీసిన ఆయన.. చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల కళ్ల ముందున్నాయని.. కులం పిచ్చి.. మత పిచ్చి పేరుతో రెచ్చగొడుతూ.. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు… కల్లబొల్లి మాటలు నమ్మకండిఅంటూ విజ్ఞప్తి చేశారు.. ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే మీరు బీజేపీ నాయకులను నిలదీయండి అని పిలుపునిచ్చారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేశారు… మీరు ఏం చేశారో చెప్పండని తెలంగాణ బిడ్డలుగా నిలదీయండి అని ప్రజలను కోరారు మంత్రి కేటీఆర్.