అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి జగదదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ చేస్తున్నా మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వ పథకాలకు కొబ్బరి కాయలు కొట్టకుండ, అభివృద్ధికి నిధులు తేవాలన్నారు.. అభివృధి అంటే కేసీఆర్ నియోజకవర్గానికి 6 వరసల రోడ్లు కాదు, మా మునుగోడు నియోజకవర్గానికి వేసి చూపించాలన్న ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు లేకుండా టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శించారు.. వేరే పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అభివృధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డ ఆయన.. నా నియోజకవర్గంలో కరోనా సమయం లో సుశీలమ్మ ఫౌండేషన్ తరపునా 5 కోట్ల రూపాయల నిత్యావసర సరుకులు పంచానని తెలిపారు.. అసెంబ్లీ సాక్షిగా నేను ప్రభుత్వాన్ని అడిగాను ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూం కాదు తక్షణమే భూమి వున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.. బంగారు తెలంగాణ చేస్తా అని మద్యం, బెల్ట్ షాపులు పెంచి తాగుబోతుల తెలంగాణ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా దేశాన్ని ఉద్దరిస్తానంటూ ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్‌ని చూసి అంతా నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.
Read also: TDP: అసెంబ్లీకి వెళ్లాలని టీడీపీ నిర్ణయం.. చంద్రబాబు మాత్రం రారు..
ఇక, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు చారితాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. మూడేళ్లుగా ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేయలేక పోతున్నానని ఫీల్ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అన్నీ ఉండి కూడా మంత్రి జగదీష్ రెడ్డీ .. 57 ఏళ్ల వాళ్లకు పింఛన్లను కూడా ఇవ్వలేక పోతున్నారని విమర్శించారు.. కానీ, సిగ్గు లేకుండా సన్మానం చేసుకుంటున్నాడని మండిపడ్డారు.. కళ్యాణ లక్ష్మి చెక్కులు సర్పంచ్ ఇస్తే సరిపోదా.. దానికి మంత్రి కావాలా..? అంటూ ఎద్దేవా చేసిన కోటమిరెడ్డి.. సన్మానం చేసినోడికి.. చేయించు కున్నోడికి కూడా సిగ్గులేదన్నారు.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తికి టికెట్ ఇప్పించి గెలిపిస్తే అమ్ముడు పోయాడని ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డి ఓడిపోతారని జోస్యం చెప్పారు.. మంత్రిగా మునుగోడు అభివృద్ధికి నిధులు తెప్పించు.. నీకు నేనే సన్మానం చేస్తానన్న ఆయన.. అసెంబ్లీలో ఎన్ని సార్లు మాట్లాడిన నిధులు ఇవ్వలేదు కానీ.. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఏమైనా సప్లయ్ కంపెనీయా అంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి.. మేం గెలిపించుకంటే… టీఆర్ఎస్ వాళ్లు తీసుకుపోతున్నారని ఫైర్ అయ్యారు.. ఎమ్మెల్యేల నుండి మొదలుకుని… ఎంపీటీసీల వరకు అందరిని కొంటున్నారని విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.