తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.. దీనిపై గవర్నర్ తమిళసై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు రేపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది.. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ 2022-23కి ఆమోదం తెలుపనున్నారు. మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2022-23ని సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు. ఇక అసెంబ్లీ సమావేవాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో చర్చించి సోమవారం ఓ నిర్ణయానికి రానున్నారు.
Read Also: Russia-Ukraine War: 10 వేల మంది రష్యా సైనికులు హతం..