తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 7 ఏళ్ళ బడ్జెట్ పై చర్చకు సిద్ధమా అని మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. అనుభవజ్ఞుడిని, మీ బడ్జెట్‌లో లొసుగులు తెలుసు కాబట్టి..…
వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకాన్ని తెలంగాణలో రానివ్వను అని ప్రకటించిన కేసీఆర్..…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా నేడు సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మోసపూరిత బడ్జెట్ ఇది అని మండిపడ్డారు. మంచినీటి పథకానికి 19 వేల కోట్లు అని, మిషన్ కాకతీయ 6 వేల కోట్లు అని, నీతి…
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్ లు హజరయ్యారు. ఈ సందర్భంగా సీ. కల్యాణ్ మాట్లాడుతూ.. వివాదాలకు తెరదించుతూ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినీ…
తెలంగాణలో ఆడపిల్ల పుడితే అదృష్ట లక్ష్మి పుట్టింది అనే సంబర పడే రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడపిల్లలందరికి మేనమామ అయ్యాడు కేసీఆర్ అని, మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కుల, మత తారతమ్యం లేకుండా 9 వేల కోట్లతో కళ్యాణ లక్ష్మీ పథకాన్ని తీసుకువచ్చి, 10 లక్షల మంది ఆడ పిల్లలకు పెళ్లికి సాయం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ…
వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మన ఊరు మనబడి కార్యక్రమం రాష్ట్రంలోని విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని కేసీఆర్ తెలిపారు.…
మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. ఇవాళ SHO గా నియామకం అయిన మధులతకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇండియాలో ప్రతీ రోజు ఉమెన్స్ డే నే…మన దేశంలో మహిళలను గౌరవించుకుంటాం. విదేశాల్లో అలా ఉండదు. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది పాత్ర కీలకం… వారి సంఖ్య కూడా పెరిగింది.. అన్నీ పీ. యస్ లలో మహిళా సిబ్బంది కి అన్నీ వసతులు…
సిటీ పోలీస్ తరపున మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హోం గార్డ్ స్థాయి నుండి డీసీపీ వరకు మహిళా పోలీస్ అధికారిణి లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమయినది. అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుంది… యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కూడా మహిళలు ముందు ఉండి నడిపిస్తున్నారు. ఇటీవల సినిమాలలో కూడా మహిళల…