వేసవి ప్రారంభానికి ముందే తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. వినియోగంలో ఆల్‌టైమ్ రికార్డు త్వరలో నమోదుకానుందని విద్యుత్ వర్గాలు చెబుతున్నాయి. దింతో కరెంట్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణలో కరెంటు డిమాండ్ ఆల్ టైమ్ రికార్డుకు దగ్గర్లో ఉంది. గత ఏడాది మార్చి చివర్లో 13 వేల 688 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను అధిగమించింది. అయితే గతేడాది మార్చి 4న అత్యధికంగా నమోదైన విద్యుత్ డిమాండ్.. ఈ ఏడు ఇప్పటికే అధికమించింది. ఈనెలాఖరులోగా…
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వనపర్తికి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 11:45 గంటలకు చేరుకుంటారు. అక్కడే అగ్రికల్చర్ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డుమార్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని ‘మనఊరు – మనబడి, మనబస్తీ…
2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం… రూ. 2,56,958.51 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లుగా ఉండగా.. క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లుగా ఉంది.. ఇక, 2022-23 ఏడాది బడ్జెట్ మొత్తం ఎంత? రాబలి ఎలా ఉంది? కేటాయింపులు ఎలా ఉన్నాయి? ఏ రంగారికి ఎంత కేటాయించారు.. లాంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రాష్ట్ర బడ్జెట్ రూ. 2.56 లక్షల…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభలోకి ప్రవేశించారు. రాజ్యాంగము బుక్ తో సభ లోకి భట్టి విక్రమార్క ప్రవేశించారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు. ఈసారి రాష్ట్ర బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు. సీఎం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధిస్తోంది. తెలంగాణ ప్రగతి మన కళ్ల…
గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. నిర్బంధపాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ప్రజాసంక్షేమ విధాన పత్రమే గవర్నర్ ప్రసంగం. దీనిమీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు. కానీ సీఎం కేసీఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు. గవర్నర్ కే…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా అన్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఉదయం 11.30 నిమిషాలకు శాసన సభలో తాను ,మండలి లో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. కోకాపేట్ లో తన నివాసం నుంచి బయలుదేరాక మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు హరీష్ రావు. మానవీయ కోణంలో ఈ…
మహిళల భద్రత, స్వయం సమృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, అదే నిజమైన మహిళా సాధికారత అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం అన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా చౌటుప్పల్‌లో నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, అందుకే అన్ని పథకాల కింద కుటుంబాల్లోని మహిళ పేరు మీద అధికశాతం ప్రయోజనాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలోని మహిళలు మరియు బాలికల భద్రత…
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చేరిగారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదని కిషన్ రెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని ఆయన విమర్శలు గుప్పించారు. దళితులకు వెన్నుపోటు పొడవటం, సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ గుణాత్మకమైన మార్పు అన్నారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన…
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణ బంగారు అయ్యిందని, ఇక దేశాన్ని బంగారు దేశంగా మర్చుతా అని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వస్తే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని, ప్రజలు అభివృద్ధి చెందుతారు అని సోనియా గాంధీ అనుకున్నారని, కానీ కేసీఆర్ ప్రజల్ని భ్రమల్లో ఉంచుతున్నారని…
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. శాసనసభ సమావేశాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్ సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.…