Madhu Yaskhi: ‘ఫ్రంట్’ సినిమాకు డైరెక్టర్ పీకే, నిర్మాత మోడీ.. నటుడు కేసీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయస్థాయిలో మరో కొత్త ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.. అయితే, కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండబోదని స్పష్టం చేశారు. ఏదేమైనా మరో ఫ్రంట్‌పై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు డైరెక్టర్ (ప్రశాంత్ కిషోర్) పీకే, ప్రొడ్యూసర్ నరేంద్ర మోడీ.. నటుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కుటుంబ పాలనకు వ్యతిరేకం కాదు.. కుటుంబ దోపిడీకి వ్యతిరేకం అన్నారు యాష్కీ.. వైఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు అసోం అధికారులు ఉన్నారు.. ఐఏఎస్‌లు బీపీ ఆచార్యలు.. శ్రీలక్ష్మిలు అవుతారన్న ఆయన.. మా పోరాటం సీఎంపైనే.. కానీ, అధికారుల మీద కాదన్నారు.
Read Also: JNTUH Exams: సందిగ్ధంలో జేఎన్టీయూ పరీక్షలు..!
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
కాంగ్రెస్ జాతీయ పార్టీ.. రీజినల్ పార్టీ కాదన్న మధుయాష్కీ.. అవినీతిలో ఆంధ్ర.. బీహార్ అధికారి అని ఉండదు.. తెలంగాణ ఐఏఎస్ లకు పదవులు ఇచ్చేది సీఎం కదా..? అని ప్రశ్నించారు. ఒక్కో అధికారికి అన్ని శాఖలు ఇచ్చిన సీఎంది తప్పన్న ఆయన.. కేసీఆర్‌ని నేను దొర లెక్క చూస్తానన్నారు.. ఇక, డీజీపీ మహేందర్ రెడ్డి… కిరణ్ కుమార్ రెడ్డి, ఐఏఎస్ శ్రీధర్ లు అత్యంత సన్నిహితులన్నారు యాష్కీ.. ఇప్పుడు కేసీఆర్‌కి సన్నిహితులుగా మారారని.. ఐఏఎస్ ల కోసం కాదు… ఉద్యోగాల ఖాళీల గురించి కొట్లాడాలన్నారు.. తెలంగాణకు ద్రోహం చేస్తుంది కేసీఆరేనని మండిపడ్డ ఆయన.. అధికారుల గురించి ఎందుకు.. నిరుద్యోగుల కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు.. తెలంగాణ వచ్చిన తర్వాత.. ఆంధ్రోళ్లు అంతా ఇక్కడే ఉన్నారు. సినిమాలు.. స్టూడియోలు అన్నీ వాళ్ల దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. ఇక, భట్టి విక్రమార్క లెక్క గ్రామ గ్రామం తిరగాలని.. అప్పుడే పార్టీకి బలం చేకూరుతుందన్నారు. ప్రచార కమిటీ తరుపున నియోజక వర్గం వారీగా అజెండా సిద్ధం చేస్తాం.. త్వరలో ప్రచార కమిటీ జిల్లా, నియోజక వర్గ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు మధు యాష్కీ గౌడ్.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!