జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు మాకు వెన్నంటే శిబూ సొరేన్ ఉన్నారు.. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంది.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాకు శిబు సోరెన్‌ని కలిపించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను వారి ఆశీర్వాదం తీసుకున్నాని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం…
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో రాంచీలో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశానికి సరికొత్త దశ, దిశ కోసం ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త పంథాలో, కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారని.. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కేసీఆర్ గుర్తుచేశారు. ఈరోజు శిబూ…
జార్ఖండ్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. గతంలో గాల్వన్ వాలీ అమర జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామన్న ప్రకటన మేరకు వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.. అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి రూ. 10 లక్షల చెక్ అందించిన సీఎం కేసీఆర్… మరో వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు కూడా రూ. 10 లక్షల చెక్‌ను అందించారు.. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి ఆ కుటుంబాలను పరామర్శించిన…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వివిధ సమస్యలపై లేఖలు రాస్తూ వస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ముఖ్యంగా కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం గురించి.. కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల్లో రాష్ట్రం వాటా నిధుల వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నా ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు.. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం రాష్ట్ర వాటా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఇవాళ రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌ను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.…
జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సమావేశం అయ్యారు.. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు.. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించారు.. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ తండ్రి…
జనగామ పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జనగామ మున్సిపాలిటీ, చంపక్ హిల్స్‌లో మానవ విసర్జీతాల శుధ్దీకరణ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగామ మున్సిపాలిటీ లోపల మల శుద్దీకరణ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషమన్నారు. 2 కోట్ల 30 లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి కేంద్రం ఇది ఆయన వెల్లడించారు. కేసీఆర్ దయవల్ల జనగామను జిల్లా చేసుకున్నామన్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం విశాలంగా ఉందని సీఎం…
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గతంలో సమ్మర్ వస్తే నీళ్ల కోసం మహిళలు ఎదురుకున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కేసీఆర్ తెచ్చారని ఆయన వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్‌ఆర్ఐ సెల్…
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మూడు రోజులు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుందని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవం వేడుకలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల మహిళలకు అందిన ఫలాల గురించి వివరించబోతున్నామని, 6వ తేదీన గ్రామంలో కేసీఆర్ ఫొటోకు రాఖీ కట్టే కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా 7వ తేదీన కళ్యాణలక్ష్మీ- కేసీఆర్ కిట్- అందిన కుటుంబాలతో…
హైదారాబాద్ కార్పోరేట్ ఆసుపత్రులలో ఎలాంటి వైద్య సేవలు, సౌకర్యాలు ఉన్నాయో అవే ఆదిలాబాద్ లో అందుబాటులో కి తెచ్చామని మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. గత పరిస్థితులు మారాయని, ఇప్పుడు వైద్యులు అన్ని చోట్లకు వస్తున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టిసారించామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోనే వైద్యం అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానం సాధించడం కోసం…