ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజలకు కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. కేసీఆర్‌కు ఎప్పుడూ రాజకీయం తప్పితే వేరే ధ్యాస లేదన్నారు.
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. సంస్థ ఛైర్మన్, ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకుంది. విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని రైతులతో పాటు ప్రజలను వరదలు ఎంతో నష్టానికి గురిచేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై మాట్లాడారు. వరద నష్ట పరిస్థితిపై సమీక్షించేందుకు వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు. రోజురోజుకూ ఈ సమస్య జటిలమవుతోందన్నారు.
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కువగా ఉందని, ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యల గురించి ఏ పార్టీ మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, నీటి పారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
What is Cloud Burst? | What is KCR’s ‘Cloud Burst’ Story ? గోదావరి వరదలతో భారీ నష్టం వాటిల్లిన తరుణంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. క్లౌడ్ బరస్ట్ సాధ్యమేనా..? అసలు ఎలా జరుగుతుంది..? గతంలో ఎవరైనా చేశారా..? విదేశీ కుట్రకు అవకాశం ఉందా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి. తెల